Share News

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:13 PM

పేద ప్రజల ఆకలి తీర్చడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌ అన్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్‌లను పునఃప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు ఐదు హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్‌ల ప్రారంభంపై సంతకం చేయగా, అందుకు హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ నగర నాయకుడు అబ్బూరి వెంకట్రావు, ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులోని నాలుగు అన్న క్యాంటీన్‌ల వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు.

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం
అన్న క్యాంటీన్‌ వద్ద అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, పక్కన వెంకట్రావు

ఎమ్మెల్యే దామచర్ల

టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ల వద్ద అన్నదానం

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 17 : పేద ప్రజల ఆకలి తీర్చడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌ అన్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్‌లను పునఃప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు ఐదు హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్‌ల ప్రారంభంపై సంతకం చేయగా, అందుకు హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ నగర నాయకుడు అబ్బూరి వెంకట్రావు, ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులోని నాలుగు అన్న క్యాంటీన్‌ల వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జనార్దన్‌, ఆయన సతీమణి నాగసత్యలత ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్‌లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామన్నారు. వీటిద్వారా రాష్ట్రంలోని వేలాది మంది పేదలు రూ.5కే కడుపు నిండా భోజనం చేశారన్నారు. అయితే ఆతర్వాత ఒక్కచాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన సైకో జగన్‌రెడ్డి పేదల కడుపు కొట్టి అన్యాయంగా వాటిని తొలగించారని ధ్వజమెత్తారు. అయితే సమర్ధవంతమైన నాయకుడు చంద్రబాబును ప్రజలు మరోసారి ముఖ్యమంత్రిని చేశారన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్‌లు పునఃప్రారంభమవుతాయని చెప్పారు. జనసేన అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయన్నారు. కార్యక్రమ ని ర్వాహకుడు అబ్బూరి వెంకట్రావు మాట్లాడుతూ నగరంలోని నాలుగు అన్న క్యాంటీన్‌ల వద్ద సుమారు పదివేల మందికి ఉచితంగా బిర్యానీ భోజనం పెట్టినట్లు తెలిపారు. జనార్దన్‌ స్పూర్తితో, ఆయన సేవలో తామూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దమ్మాలపాటి పాపారావు, ఏదుబాటి కొండయ్య నాయుడు, గోరంట్ల వెంకన్న, కాకర్ల వెంకట సుబ్బారావు, మార్నేని రాఘవ, కాట్రగడ్డ సుబ్బారావు నాయుడు, త్రివేణ్‌బాబు, వాయల మల్లికార్జున్‌తోపాటు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. భారీగా హాజరైన ప్రజలుత్వరలో అన్న క్యాంటీన్‌ల పునఃప్రారంభంపై ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 17 , 2024 | 11:13 PM