Share News

వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:35 AM

వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని గిద్దలూరు ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్‌ రెడ్డి జగన్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం

కంభం, ఏప్రిల్‌ 16 : వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని గిద్దలూరు ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్‌ రెడ్డి జగన్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నవ రత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా 13వ రోజు అర్థవీడు మండలంలోని అచ్చంపేట, బొల్లుపల్లె, పాపి నేనిపల్లి, అంకభూపాలెం, నారంపల్లి, అర్థ వీడు, చీమలేటిపల్లి, దొనకొండ, వీరభద్రాపురం, కొత్తూరు, అయ్యవారిపల్లి, చింతమల్లెలపాడు, చిన్నకందుకూరు, పెద్దకందుకూరు, శంకరా పురం, మొహిద్దీన్‌పురం, బోగోలు గ్రామాల్లో పర్యటించారు. అశోక్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామాల్లోని టీడీపీ శ్రేణులు, గ్రామ ప్రజలు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని కలిసి ఆప్యాయంగా మాట్లాడుతూ.. పర్యటనను కొనసాగించారు. మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్‌డీఏ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనకు, ఒంగోలు పారర్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శీన్రివాసరెడ్డిని సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్ధించారు. రానున్న ఎన్నికల్లో మీ ఇంటి బిడ్డకు, పక్క నియో జకవర్గానికి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పోటీ అని తనను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించా లని కోరారు. కార్యక్రమంలో అర్థవీడు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముత్తుముల తనయుడి ప్రచారం

బేస్తవారపేట, గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే అశోక్‌రెడ్డి లక్ష్యమని ఆయన తనయుడు దివ్యేష్‌ ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బేస్తవారపేట మండలంలోని పీవీ.పురం, బసినేపల్లె పంచాయతీలోని ముఖ్యనాయకులతో, కార్యకర్తలతో సమావేశమ య్యారు. టీడీపీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెన్నివారిపల్లెలో వైసీపీ నుంచి టీడీపీలోకి పది కుటుంబాలు చేరాయి. కార్యక్రమంలో సోరెడ్డి మోహన్‌రెడ్డి, పూనూరు భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:35 AM