Share News

చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:02 PM

రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలం టే తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు రావల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. సోమవారం సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం అడ్డరోడ్డులో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పలువురు టీడీపీలో చేరారు. బ ల్లికురవ మండలం గొర్రెపాడు గ్రామానికి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి రవికుమార్‌ సమక్షంలో టీడీ పీ తీర్థం పుచ్చుకొన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు
బల్లికురవ: ఎమ్మెల్యే రవికుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరుతున్న వైసీపీ గొర్రెపాడు నేతలు, కార్యకర్తలు

రెండు నెలల్లో జగన్‌ ఇంటికే!

టీడీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

బల్లికురవ, ఫిబ్రవరి 12: రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలం టే తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు రావల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. సోమవారం సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం అడ్డరోడ్డులో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పలువురు టీడీపీలో చేరారు. బ ల్లికురవ మండలం గొర్రెపాడు గ్రామానికి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి రవికుమార్‌ సమక్షంలో టీడీ పీ తీర్థం పుచ్చుకొన్నారు. ఈసందర్భంగా అయన మాట్లా డుతూ జగన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజునుంచే ఏపీ సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ప్రజావేదిక కూల్చివేత నుంచి పన్నుల బాదుడుతో నిరుపేదలను నమ్మించేలా మాయమాటలు చెప్పి అన్నివర్గాల ప్రజలకు విసుగు కలిగించేలా జగన్‌ పాలన సాగిందన్నారు. మరో రెండు నెలల్లో జగన్‌ రెడ్డి ఇంటికి పోవటం తథ్యమని చెప్పారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. దళితులకు గత టీడీపీ ప్రభుత్వం అందించిన వంద పథకాలను రద్దు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. 2019 నుంచి ఆంధ్రప్ర దేశ్‌ను అప్పుల కుప్పగా మార్చి ప్రతి ఒక్కరిపై లక్షల్లో అప్పులు చేశారని రవికుమార్‌ ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మాట తప్పి మహిళలను మోసం చేశారని అన్నారు. టీడీపీ కార్య కర్తలు రెండు నెలల పాటు సైనికుల్లా పనిచేయాల న్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలందరికి లబ్ధి చేకు రేలా టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై ప్రచారం నిర్వ హించాలన్నారు.

కార్యక్రమంలో పార్టీలో చేరిన గొర్రెపాడు నేతలు మక్కెన స్వాములు, రాయల అంకమ్మరావు, గుంటూరు వెంకట్రామయ్య, మక్కెన సత్యనారాయణ, గొల్లపూడి చిన్న, జండ్రాజుపల్లి పూర్ణయ్య, గుమ్మడెల చిన్నఅం జయ్య, మెట్ల దానారావు, గుంటూరు గిరిబాబు, ఏలూరి నారాయణ, మక్కెన వెంకటేశ్వర్లు, కల్లూరి ఆశోక్‌, తదిత రులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో గాడితప్పిన పాలన

అద్దంకి, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. పాలనను గాడిలో పెట్టాలంటే చంద్రబాబునాయుడుకే సాధ్యమని చెప్పారు. మండలంలోని వెంపరాల ఎస్సీ కాలనీకి చెందిన పలువురు వైసీపీ నేతలు, ఆయా కుటుంబాల సభ్యులు, మహిళలతో పుట్టావారిపాలెం వద్ద ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వెళ్లి టీడీపీ లో చేరారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సబ్‌ప్లాన్‌ నిధులు పక్క దారి పట్టించటంతో పలు పథకాలకు నిధులులేకుండా పోయాయన్నారు. దాచుకోవటం, దోచుకోవటం మినహా రాష్ర్టానికి జగన్‌మోహన్‌రెడ్డి చేసిందేమి లేదన్నారు. సీఎం పదవికి జగన్‌ అనర్హుడన్నారు. ఒక్క చాన్స్‌ పేరు తో అధికారంలోకి వచ్చి రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించారన్నా రు. రాబోయే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు చం ద్రబాబు నాయుడుని గెలిపించి రాష్ట్ర భవిష్యత్‌ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

టీడీపీలో చేరిన వారిలో మున్నంగి బాబూరావు, ము న్నంగి నాగేష్‌, గరిగల అంకయ్య, డేవిడ్‌, అబ్రహం, ఆ నందరావు, ఎడ్లపల్లి నగేష్‌బాబు, మందా దేవసహాయం తదితరులతో పాటు ఆయా కుటుంబసభ్యులు, మహిళ లు ఉన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 11:02 PM