చంద్రబాబు అధికారంలోకి వస్తేనే భవిష్యత్
ABN , Publish Date - Apr 03 , 2024 | 10:37 PM
చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ర్టానికి మంచి భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని బూదవాడ గ్రామంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ బుధవారం రాత్రి స్థానిన నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.

బూదవాడ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గొట్టిపాటి
పంగులూరు, ఏప్రిల్ 3 : చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ర్టానికి మంచి భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని బూదవాడ గ్రామంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ బుధవారం రాత్రి స్థానిన నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే పొత్తుతో పోటీకి దిగామన్నారు. ప్రజా ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ పాలన ఐదేళ్లుగా సాగుతోందన్నారు. జగన్‌రెడ్డి పాలనకు చరమగీతం పాడాలని గొట్టిపాటి పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు జగన్‌రెడ్డి అనేక హామీలను గుప్పించి వాటిని తుంగలోకి తొక్కారన్నారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల వేళ అబద్ధపు ప్రచారంతో ప్రజలను మోసగించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లుగా అనేక వాటిపై ధరలు, పన్నులు పెంచి పేదలను పీడించారన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు, రైతులు, శ్రామికులు, వ్యాపారులు నష్టపోయారని గొట్టిపాటి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కష్టాలు తొలగిపోయేందుకు మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు. మే 13న జరిగే ఎన్నికలో సైకిల్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని గొట్టిపాటి విజ్ఙప్తి చేశారు. రైతులకు రూ.13,500 ఇస్తామని చెప్పి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చి మోసం చేశారన్నారు. క్రాప్ ఇన్స్యూరెన్స్‌కు సంబందించి అసలు ప్రీమియమే కట్టలేదన్నారు. 9 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని అమలు చేయలేదన్నారు. విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెడుతూ వారిని మనోవేదనకు గురిచేశారన్నారు. ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు, గోడౌన్‌లు కడతామని చెప్పిన జగన్‌రెడ్డి ఎక్కడా ఒక్కటీ నిర్మించలేదన్నారు. కోఆపరేటివ్ సెక్టార్‌ను పునరుద్ధరిస్తామని మాయమాటలు చెప్పిన వైసీపీ వాటిని పట్టించుకోకపోగా, మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను, డెయిరీలను తెరిపించలేదన్నారు. చిత్తూరు, ఒంగోలు పాల డెయిరీలను అమూల్‌కి కట్టబెట్టడం వెనుక ఎంతటి మోసం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు ఏడాదికి రూ.20వేల పెట్టుబడి సాయం అందించడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తామని గొట్టిపాటి తెలిపారు. ప్రచార కార్యక్రమంలో కొమ్మారెడ్డి సుబ్బారెడ్డి, అలవల సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డితో, పార్టీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్, కేవీ సుబ్బారావు, బాలిన రామసుబ్బారావు, కుక్కపల్లి ఏడుకొండలు, సహదేవుడు, ఆదిశేఖర్, మస్తాన్‌వలి, ఆదిరెడ్డి, నార్నె సుబ్బారావు, పెడవల్లి అశోక్, ఉన్నం రవిబాబు, అమృతపూడి ఏసోబు, ఓబుల్‌రెడ్డి, రాధాకృష్ణ, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.