మార్కాపురం జిల్లా ఏర్పాటు లాంఛనమే..!
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:11 PM
పశ్చిమ ప్రకాశ ప్రజ ల ప్రధాన కోరికైన మార్కాపురం జిల్లా ఏర్పాటు లాంఛనమే అని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు.
మార్కాపురం, జూన్ 17: పశ్చిమ ప్రకాశ ప్రజ ల ప్రధాన కోరికైన మార్కాపురం జిల్లా ఏర్పాటు లాంఛనమే అని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా సోమ వారం ఆయన మార్కాపురం వచ్చారు. ఈ సంద ర్భంగా స్థానిక జవహర్‌నగర్ కాలనీలోని ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. మార్కా పురం జిల్లా తప్పక ఏర్పాటు చేస్తానని సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పలుమార్లు హామీ ఇచ్చార న్నారు. హామీని తప్పక నెరవేరుస్తారని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి వరప్రదాయిని అయిన వెలుగొండ ప్రాజెక్టులో కీలకమైన హెడ్ రెగ్యులేటర్ ప్రాంతం నంద్యాల జిల్లాలో ఉందని అన్నారు. ఆ ప్రాంతాన్ని నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తాను కోరతానని తెలిపారు. అంతకు ముందు స్థానిక సమస్యలపై ప్రజలతో మాట్లాడారు.
అరాచర పాలనకు
ప్రజలు చరమగీతం పాడారు
గత ప్రభుత్వ అరాచక పాలనకు విసిగివేసారిన రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడి ఇంటికి పంపా రని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. నాటి ముఖ్యమంత్రి జగన్ రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించాడని అన్నా రు. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడం మిన హా అభివృద్ధి లేదన్నారు. వ్యవస్థల న్నీ నాశనమయ్యాయని విమర్శిం చారు. రాష్ట్రం దుస్థితి గురించి సొం త పార్టీ నేతలు ఎవరైనా చెప్పినా ఆ నియంతకు వినిపించలేదన్నారు. 2014లో ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్ జగన్ పాలన వలన మరో 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు పోయిందన్నారు. రాష్ర్టా న్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే ఒక్క చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని భావించే ప్రజలు 2024 ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని అందించారన్నారు. అన్ని వర్గాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతి చ్చాయని అన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్‌కు సరైన బుద్ది చెప్పారన్నారు. ఇక రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని అన్నారు. ఇప్పటికే ఐదు ప్రధానమైన హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేశారన్నారు. అంతేకాక త్వరలోనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కూడా ఆయన అమలు చేస్తారని అన్నారు. పార్లమెంటు పరిధిలో తనను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిన దర్శి, యర్రగొండ పాలెం నియోజకవర్గాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఛార్జి కందుల రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి ఉన్నారు.