Share News

కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Jun 03 , 2024 | 01:10 AM

కన్న కుమారుడిని తు పాకీతో కాల్చి చంపిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కొదమల ప్రసాద్‌బాబును అరెస్టు చేసినట్లు ఒంగోలు తా లుకా సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు. శనివారం రా త్రి స్థానిక భాగ్యనగర్‌ 4వ లైన్‌లో గల వీవీపాడ్స్‌ రిజర్వుడ్‌ గోదాం వద్ద విధులలో ఉన్న ఏఆర్‌ కాని స్టేబుల్‌ ప్రసాద్‌బాబు తన కుమారుడు శేషుకమల్‌ (20)ని తుపాకీతో కాల్చి దారుణంగా చంపాడు.

 కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్‌ అరెస్ట్‌

తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డి వెల్లడి

ఒంగోలు(క్రైం), జూన్‌ 2: కన్న కుమారుడిని తు పాకీతో కాల్చి చంపిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కొదమల ప్రసాద్‌బాబును అరెస్టు చేసినట్లు ఒంగోలు తా లుకా సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు. శనివారం రా త్రి స్థానిక భాగ్యనగర్‌ 4వ లైన్‌లో గల వీవీపాడ్స్‌ రిజర్వుడ్‌ గోదాం వద్ద విధులలో ఉన్న ఏఆర్‌ కాని స్టేబుల్‌ ప్రసాద్‌బాబు తన కుమారుడు శేషుకమల్‌ (20)ని తుపాకీతో కాల్చి దారుణంగా చంపాడు. వి వరాలలోకి వెళితే.. మద్య సేవించిన ప్రసాద్‌బాబు ను కుమారుడు శేషుకమల్‌ వారు నివాసం ఉండే స్థానిక శ్రీనివాసకాలనీ ఒకటో లైన్‌లో నుంచి మో టార్‌సైకిల్‌పై తీసుకొచ్చి విధులు నిర్వహించే గో దాం వద్ద వదిలిపెట్టాడు. అయితే ప్రసాద్‌బాబు త న జీతం రూ.20వేలు నగదును డ్రా చేసి తన వద్ద ఉంచుకున్నాడు. దీంతో ఆ నగదును మద్యం తాగిన తన తండ్రి వద్ద ఎందుకని కుమారుడు ప్రశ్నించి డంతో వారి మధ్య వివాదం జరిగింది. ఈక్రమంలో కోపోద్రేకుడైన ప్రసాద్‌బాబు తన వద్ద ఉన్న రివా ల్వర్‌తో రాత్రి 10 గంటల సమయంలో కుమారుడి పై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో బులెట్‌ ఛాతీపై తగలడంతో శేషుకమల్‌ అక్కడిక్కడే కు ప్పకూలాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే కుమారుడిపై కాల్పులు జరిపిన ప్రసాద్‌బా బు తన వద్ద ఉన్న రివాల్వర్‌తో మరలా అక్కడ వి ధులలో ఉన్న వారిని సైతం బెదిరించాడు. ఈ సమ యంలో అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు చాకచక్యంగా ప్రసాద్‌బాబు వద్ద ఉన్న ఆయుధాన్ని తీసుకొని మ రో ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఈ మే రకు అదుపులోకి తీసుకున్న ప్రసాద్‌బాబును అ రెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ భక్త వత్సలరెడ్డి వెల్లడించారు. కాగా కన్న తండ్రి చేతిలో మృతి చెందిన శేషు కమల్‌ మృతదేహానికి ఒంగోలు తహసీల్దార్‌ సుజన్‌ కుమార్‌ ఆదివారం శవపంచనామా చేశారు. రిమ్స్‌ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అ ప్పగించారు.

Updated Date - Jun 03 , 2024 | 01:10 AM