Share News

రెండో రోజూ కొనసాగిన ఆందోళన

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:59 AM

ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు జిల్లావ్యాప్తంగా రెండోరోజైన శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు.

రెండో రోజూ కొనసాగిన ఆందోళన
ఒంగోలులోని రిమ్స్‌ వద్ద నిరసన తెలుపుతున్న నర్సులు, ఉద్యోగులు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 16 : ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు జిల్లావ్యాప్తంగా రెండోరోజైన శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు. ఏపీ జేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఒకచోటకు చేరి ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. జేఏసీ జిల్లా చైర్మన్‌ కూచిపూడి శరత్‌బాబు నాయకత్వంలో స్థానిక రిమ్స్‌ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇదే విధానాలను అవలంబిస్తే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని శరత్‌బాబు హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు కొత్తపల్లి మంజేష్‌, శివకుమార్‌, వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, షరీఫ్‌, ప్రసన్న, కిషోర్‌, సునీల్‌, రోజ్‌కుమార్‌, మాధవి, కోటేశ్వరమ్మ, రత్నారాణి, విజయ, సాల్మన్‌రాజు, భాస్కర్‌, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:59 AM