Share News

మండే ఎండలు .. ఆగుతున్న మగ్గం..!

ABN , Publish Date - May 29 , 2024 | 10:28 PM

పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా యి. మగ్గంపై నేత పని కుంటుపడుతోంది. దీంతో మ గ్గం ఉన్న చేనేత కార్మికులకు కూడా రోజువారీ మజూరీ గిట్టుబాటు కావడం లేదు. ఇక చేనేత ఉప వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ క్రమంలో మగ్గం ఉన్న కార్మికులకు వర్తింపజేసే సంక్షేమ పథకాలను తమకు కూడా అందించి ఆదుకోవాలని చేనేత ఉప వృత్తుల కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకైనా గోడును ఆలకించి తమకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.

మండే ఎండలు .. ఆగుతున్న మగ్గం..!
మగ్గంపై నేత నేస్తున్న చేనేత మహిళ

అడకత్తెరలో పోకచెక్కలా

ఉప వృత్తులవారి పరిస్థితి

మగ్గం ఉన్న నేతన్నలకు మాదిరిగా

తమకూ పథకాలు వర్తింపచేయాలని

కార్మికుల విజ్ఞప్తి

చీరాల, మే 29 : పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా యి. మగ్గంపై నేత పని కుంటుపడుతోంది. దీంతో మ గ్గం ఉన్న చేనేత కార్మికులకు కూడా రోజువారీ మజూరీ గిట్టుబాటు కావడం లేదు. ఇక చేనేత ఉప వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ క్రమంలో మగ్గం ఉన్న కార్మికులకు వర్తింపజేసే సంక్షేమ పథకాలను తమకు కూడా అందించి ఆదుకోవాలని చేనేత ఉప వృత్తుల కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకైనా గోడును ఆలకించి తమకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.

చీరాల నియోజకవర్గంలో సుమారు 7,600 మగ్గాలు ఉన్నాయి. చీరాల మండలం ఈపురుపాలెం నుంచి వేటపాలెం మండలం పందిళ్లపల్లి వరకు చేనేత, దాని ఉపవృత్తులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50వేల మంది ఉంటారు. మగ్గం పని సజావుగా సాగాలంటే ముడిసరుకుల ధరలు అందుబాటులో ఉండటంతో పాటు వాతావరణం కూడా సజావుగా ఉండాలి. అయితే నూలు, రంగులు, రసాయానాల ధరలు పెరిగాయి. దీంతో పెట్టుబడి భారం పెరిగింది. ఇక మండే ఎండలతో మగ్గం పని ఆగుతోంది. ఎండల తీవ్రత ఎ క్కువగా ఉన్న సమయంలో మధ్యాహ్నం వేళల్లో మగ్గం పని సాగదు. సగటు చేనేత కార్మికుల్లో సింహ భాగం రెక్కాడితేగాని డొక్కాడని వారే. అలాంటి వారికి పనిగంటలు తగ్గితే.. రోజువారీ మజూరీ (కూలి)లో కోత పడుతుంది. పెరిగిన నిత్యావసర సరుకుల నేపథ్యంలో రో జుకు ఇంటిల్లపాదీ కడుపునిండా మూడు పూటలా భో జనం చేయాలంటే రోజుకు సుమారు రూ.200 ఖర్చవుతుంది. పనిసాగకపోతే ఒక్కో రోజు రూ.100కు మించి కూలి గిట్టుబాటుకాని పరిస్థితి. దీనిని అధిగమించాలం టే ప్రభుత్వ పరంగా చేయూత అందించాలని వారు కోరుతున్నారు. ఇక ఉపవృత్తులపై ఆధారపడి జీవించేవారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వీరికి నేతన్న నేస్తం కూడా వర్తించదు. చేనేత ఉపవృత్తులపై జీవించేవారికి కూడా నేతన్న నేస్తం వర్తింపజేయాలని ఎంతో కాలంగా ఆ రంగ ప్రతినిధులు కోరుతున్నారు. అయితే అది ఆచరణకు నోచుకోలేదు. అది ఎప్పటికి ఆచరణలో కి వస్తుందో తెలీని పరిస్ధితి. ఈ క్రమంలో నేతన్నలు గ డ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటయ్యే ప్రభుత్వమన్నా చేనేత ఉపవృత్తుల వారికి కూడా మగ్గం ఉన్న చేనేత కార్మికులకు వర్తింపజేసే సంక్షేమ పధకాలను వర్తింపచేయాలని కో రుతున్నారు. అందుకు అనుగుణంగా పాలకులు, అధికారులు స్పందించి తగిన చర్యలు చేపడతారని ఆశిద్దాం.

Updated Date - May 29 , 2024 | 10:28 PM