ప్రజల సహకారంతోనే అడ్డుకట్ట
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:31 PM
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్థానికులు చైతన్యవంతులు కావాలని చీరాల ఆర్డీవో సూర్యనారాయణరెడ్డి, తహసీల్దార్ గోపీకృష్ణ సూచించారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని వాడరేవు, బుర్లవారిపాలెం ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అధికారులు మంగళవారం పరిశీలించారు. ఇసుక రవాణాపై సచివాలయాల సిబ్బందితో అంచనా వేశారు.
అక్రమ తవ్వకాలను పరిశీలించిన అధికారులు
కలెక్టర్‌కు పంపేందుకు నివేదిక సిద్ధం
చీరాలటౌన్, సెప్టెంబరు 10 : ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్థానికులు చైతన్యవంతులు కావాలని చీరాల ఆర్డీవో సూర్యనారాయణరెడ్డి, తహసీల్దార్ గోపీకృష్ణ సూచించారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని వాడరేవు, బుర్లవారిపాలెం ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అధికారులు మంగళవారం పరిశీలించారు. ఇసుక రవాణాపై సచివాలయాల సిబ్బందితో అంచనా వేశారు. తవ్వకాలు జరిగిన ప్రదేశాలు ప్రైవేటు స్థలాలా లేక ప్రభుత్వ స్థలాల వంటి విషయాలపై నివేదికను సిద్ధం చేశారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడారు. ఇసుక రవాణా జరిగే సమయంలో విషయాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. కొల్లూరు వంటి ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక వ్యాపారాలు జరగడం వలనే నీళ్లు నిలిచి నివాసాల్లోకి నీరు చేరినట్లు వివరించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఇసుక రవాణాపై డీఎస్పీ జగదీష్, తహసీల్దార్‌తో సమావేశం నిర్వహించారు.