Share News

అద్దంకి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:06 PM

అద్దంకి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడు లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించిన అద్దంకి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఆదివారం మేదరమెట్లలో ఉన్న ఆయన్ను కొరిశపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకునే విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్ననని అన్నారు.

  అద్దంకి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
రాష్ట్ర విద్యుత్‌శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్‌కు మొక్కను ఇచ్చి అభినందనలు తెలుపుతున్న బాపట్ల అడిషినల్‌ ఎస్పీ విఠలేశ్వర్‌

మేదరమెట్ల, జూన్‌ 23 : అద్దంకి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడు లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించిన అద్దంకి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఆదివారం మేదరమెట్లలో ఉన్న ఆయన్ను కొరిశపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకునే విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్ననని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారింస్తానన్నారు. విద్యుత్‌ సరఫరపై అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేసి రైతులకు, పారిశ్రామిక వేతలకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి విద్యుత్‌ శాఖకు మెరుగైన ఫలితాలు తీసుకురావాలన్నారు. అద్దంకి నియోజవర్గంలోని రైతులకు, ప్రజలకు సాగు, తాగునీటి సంబంధించిన పథకాలు పూర్తి చేయిస్తానన్నారు. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, స్థానిక సమస్యలను పరిష్కారించేందుకు ప్రణాళికతో ముందుకు సాగడం సాగుతానని ఆయన హామీ ఇచ్చారు.

మంత్రిని కలిసి పలువురు

బాపట్ల జిల్లా అడిషనల్‌ ఎస్పీ విఠలేశ్వర్‌, రిటైర్డ్‌ డీఆర్‌వో నాగబాబులు మంత్రిని కలిసి సన్మానించి అభినందనలు తెలియజేశారు. రావినూతల, కుర్రవానిపాలెంకు చెందిన తెలుగు మహిళలు రవికుమార్‌కు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్రాంగణం అంత కిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరిని మంత్రి రవికుమార్‌ ఓర్పుతో పలకరిస్తూ ఫొటోలు దిగుతూ మూడు గంటల సేపు వారితో గడిపారు. అభినందనలు తెలపడానికి రావడంతో పాటు వ్యక్తిగత సమస్యలను అయన దృష్టికి తీసుకువచ్చారు. అందరికి నవ్వుతు సమాధానాలు చెప్పారు.

Updated Date - Jun 23 , 2024 | 11:07 PM