Share News

ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:50 PM

యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే కూటమి మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమని కనిగిరి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీ విడుదలపైౖ తొలి సంతకం చేస్తారన్నారు.

ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం
హనుమంతునిపాడు మండలంలో రోడ్‌షోలో మాట్లాడుతున్న టీడిపి అబ్యర్ది డాక్టర్‌ ఉగ్ర

టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, ఏప్రిల్‌ 30: యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే కూటమి మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమని కనిగిరి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీ విడుదలపైౖ తొలి సంతకం చేస్తారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు వృద్ధాప్య పింఛన్‌ను రూ2వందల నుంచి రూ2వేలకు ఒకేసారి పెంచారని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను అధికారంలోకి వచ్చినవెంటనే ఒకేసారి రూ3వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రూ3వేలు ఉన్న పింఛన్‌ను రూ4వేలకు పెంచుతామని చెప్పారు. జగన్‌ ప్రభుత్వంలో ఇసుకఉ బంగారం మాదిరిగా అమ్ముకుని వైసీపి నేతలు పేదల జేబులు కొట్టి వారి పొట్టలు నింపుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుకతో పాటు, అన్నాక్యాంటీన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భూహక్కు చట్టం తీసుకవచ్చి పేదల ఆస్తులు లాక్కొన్నేందుకు జగన్‌ పన్నాగం పన్నారని ఆరోపించారు. ఈ చట్టాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు చార్జీలు పెంచేదేలేదన్నారు. ప్రజలందరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. సమావేశంలో టీడీపీ నాయకులు పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, రోషన్‌సంధాని, ఫిరోజ్‌, అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ

కనిగిరి, ఏప్రిల్‌ 30: రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం, దొడ్డిచింతల, కిష్టంపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు డాక్టర్‌ ఉగ్రకు బ్రహ్మరఽథం పట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం తనను గెలిపించాలని కోరారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే పేదల బతుకులు అంధకారమేపపి అన్నారు. కనిగిరి ప్రాంతం అభివృద్ధి కావాలంలే సాగు, తాగు నీటితో పాటు ఉపాధి, ఉద్యోగాల కల్పన ముఖ్యమన్నారు. అందుకోసం తాను ఐదు అభివృద్ధి పనులతో పక్కాగా ముందుకుపోతానన్నారు. హనుమంతునిపాడు మండలంలో బత్తాయి, నిమ్మ, జామ, ఉద్యానవన పంటల సాగుకు ఊతమిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్‌), గాయం తిరుపతిరెడ్డి, చావలి చినవెంకటేశ్వర్లుయాదవ్‌, గాయం రామిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, మురహరి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:50 PM