Share News

ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Apr 25 , 2024 | 10:40 PM

వెనుకబడిన దొన కొండ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు కల్పించటమే తమ ప్రథ మ కర్తవ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.

ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం
దొనకొండ మండలం నరసింహనాయుని పాలెంలో ప్రసంగిస్తున్న గొట్టిపాటి లక్ష్మి

దొనకొండలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం

టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దొనకొండ, ఏప్రిల్‌ 25: వెనుకబడిన దొన కొండ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు కల్పించటమే తమ ప్రథ మ కర్తవ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని గంగదేవి పల్లి, పెద్దగుడిపాడు, చిన్నగుడిపాడు, ఎన్‌ఎన్‌పాలెం, పెద్దన్న పాలెం, దొండపాడు, ఆరవళ్లిపాడు, తెల్లబాడు, నల్లబోతు లవారిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో సంవత్సరాలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న తాగునీటి సమ స్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో దర్శి నియోజక వర్గం అభివృద్ధిలో ముందుందని చెప్పారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో అభి వృద్ధిలో ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదని ధ్వజమెతా ్తరు. గొట్టిపాటి కుటుంబం ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఆ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు. అవినీతి సం పాదన అవసరం లేదని, ప్రజలను ఇబ్బంది పెట్టే మనస్తత్వం తమది కాదని చెప్పారు. ప్రజల సొ మ్ము అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని ఆ మె విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టీ డీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, వీరపనేని వెంకన్నచౌదరి, కందుల నారపురెడ్డి, తదితరు లు పాల్గొన్నారు.

శివరాంపురం ఉపసర్పంచ్‌ టీడీపీలో చేరిక

తాళ్లూరు, ఏప్రిల్‌ 25: మండలంలోని శివ రాంపురం ఉపసర్పంచ్‌, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రధాన అనుచరుడు నారిపెద్ది రామ్మూర్తి ఆ ధ్వర్యంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరారు. కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో దర్శిలోని ఆమె నివా సంలో బుధవారం రాత్రి పార్టీలో చేరారు. వైసీపీ కి చెందిన నారిపెద్ది శ్రీనివాసరావు, సయంపు రత్తయ్య, ముప్పనేని లక్ష్మీనారాయణ, ముప్పనేని సుబ్బారావు, మ న్నెం రాజా, తేళ్ల అంజయ్య, అనుపర్తి నగేష్‌, పున్నారావు, తేళ్ల నరసయ్య, తొలుచూరి సుబ్బారావు, కొంగల సుబ్బరాయుడు తదితరులకు డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ కం డువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనపై విసుగెత్తిన ప్రజలు టీడీపీ కూటమిపై చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలోనే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

టీడీపీలో పలుకుటుంబాలు చేరిక

దర్శి, ఏఫ్రిల్‌ 25: మండలంలోని పోతవరం పంచాయతీ తిమ్మాయిపాలెంకు చెందిన 15 కుటుంబాలు గురువారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. స్థానిక టీడీపీ నాయకులు పి.రమణారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, సుబ్బా రెడ్డిల ఆధ్వర్యంలో వివిధవర్గాలకు చెందిన 15 కుటుం బాలు టీడీపీలో చేరారు. కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌ వారికి టీడీపీ కండు వాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకముందు దర్శి పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నుంచి టీడీ పీలో చేరారు. ఈసందర్భంగా లలిత్‌సాగర్‌ మాట్లాడుతూ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగు పడుతుందనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారని చెప్పారు. వైసీపీ అరాచక పాలన భరించలేక అన్నివర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో దర్శి నగర పంచా యతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌ చైర్మన్‌ తలారి కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.

‘ముండ్లమూరు’లో పలువురు చేరిక

ముండ్లమూరు, ఏప్రిల్‌ 25: మండలంలోని మారెళ్ళ గ్రామానికి చెందిన చిరుమామిళ్ళ సుబ్బారావు, దొప్పలపూ డి శ్రీను, కంచర్లగుంట ఈశ్వరరావు, వెల్లంపల్లి శ్రీను, పొ దిలి సాంబమూర్తి, బత్తుల నరసింహా, వలంటీరు బత్తుల కృష్ణ, పల్లా లక్ష్మీనారాయణలు వైసీపీని వీడి గురువారం డాక్టర్‌ లలిత్‌ సాగర్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు సుంకర రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, వాకా బ్రహ్మారెడ్డి, పాశం వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో పది కుటుంబాలు టీడీపీ లో చేరారు. వీరికి లలిత్‌ సాగర్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలాగే, శంకరాపురం గ్రామా నికి చెందిన వైసీపీ యవ నాయకుడు మందలపు అశోక్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో గురువారం లలిత్‌ సాగర్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.

Updated Date - Apr 25 , 2024 | 10:40 PM