Share News

వైద్యురాలిని హత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలి

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:28 AM

కోల్‌కతాలో వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడి దారుణం గా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించా లని జనసేన పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

వైద్యురాలిని హత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలి

జనసేన పార్టీ డిమాండ్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 20 : కోల్‌కతాలో వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడి దారుణం గా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించా లని జనసేన పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. మహిళా డాక్టర్‌ హత్యను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఒంగోలులో కొ వ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక అద్దంకి బస్టాండులోని సుబ్బరామరెడ్డి విగ్రహం వద్దనుంచి అద్దంకి బస్టాండులోని ఎన్టీఆర్‌ విగ్ర హం వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ సభ్యసమాజం తలదిం చుకునే విధంగా క్రూరంగా మహిళా డాక్టర్‌పై అ త్యాచారం చేసి దారుణంగా హత్య చేయడం దు ర్మార్గంగా ఉందన్నారు. ఇటువంటి ఘటనలు పున రావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు చ నపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్‌, మహ్మద్‌ యూనిస్‌, పల్ల ప్రమీల, ఆర్‌కే.నాయుడు, దండే అనిల్‌, గోవింద్‌కోమలి, మదాసు సాయి, సుంకర క ల్యాణి, షేక్‌ ముంతాజ్‌, వాసుకి నాయుడు, ప్రమీ ల, అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:28 AM