Share News

టీచర్లు 9గంటల్లోపు హాజరు నమోదు చేయాలి

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:58 PM

టీచర్లు విధిగా తొమ్మిది గంటలలోపు ముఖ ఆధారిత హా జరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఈవో కిరణ్‌కుమార్‌ ఆదేశించారు. .చీమకుర్తి పట్టణంలో ఎంఆర్సీ భవనంలో గురువారం నిర్వహించిన ప్ర ధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన డిప్యూటీ డీఈవో చంద్రమౌళేశ్వరరావుతో కలిసి హాజరయ్యా రు.

 టీచర్లు 9గంటల్లోపు హాజరు నమోదు చేయాలి

డీఈవో కిరణ్‌కుమార్‌ ఆదేశం

చీమకుర్తి, నవంబరు28(ఆంధ్రజ్యోతి): టీచర్లు విధిగా తొమ్మిది గంటలలోపు ముఖ ఆధారిత హా జరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఈవో కిరణ్‌కుమార్‌ ఆదేశించారు. .చీమకుర్తి పట్టణంలో ఎంఆర్సీ భవనంలో గురువారం నిర్వహించిన ప్ర ధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన డిప్యూటీ డీఈవో చంద్రమౌళేశ్వరరావుతో కలిసి హాజరయ్యా రు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ అపా ర్‌ ఐడీలను వందశాతం పూర్తి చేయాలని కోరారు. దీనికోసం చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పల్లామల్లి హైస్కూల్లో ఆధార్‌ నమోదు కేంద్రా లను ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబరు7న ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చబోతున్న మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ విజ యవంతానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొం దించుకోవాలన్నారు. ఉపాధ్యాయులు తమ సెలవు లను యాప్‌లో కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. విద్యార్థుల హాజరును ఉదయం తొ మ్మిదిన్నర గంటలలోపు పూర్తి చేయాలన్నారు. డి ప్యూటీ డీఈవో చంద్రమౌళేశ్వరరావు మాట్లాడు తూ మెనూ ప్రకారం మధ్యాహ్నభోజనాన్ని విద్యా ర్థులకు అందివ్వాలన్నారు. విద్యార్థుల హాజరును, భోజనాన్ని తీసుకొనే శాతాన్ని పెంచాలన్నారు. డై ట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సామా సుబ్బారావు, డీసీ ఈబీ సెక్రటరీ మర్రి శ్రీనివాసరావులు పరీక్షల ని ర్వహణ, అపార్‌ నమోదులపై సమీక్షించారు. అ పార్‌ నమోదులో ప్రతిభచాటిన రామతీర్థం టీచ ర్‌ విజయక్రాంతి సుధాను అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు న రసింహారావు, శివాజీ, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:58 PM