Share News

నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష

ABN , Publish Date - Oct 03 , 2024 | 01:31 AM

జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌) గురువారం నుంచి ఈనెల 21 వరకూ జరగనుంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష

11,566 మంది అభ్యర్థులు

నాలుగు కేంద్రాలు.. డీవోల నియామకం

ఒంగోలు (విద్య), అక్టోబరు 2 : జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌) గురువారం నుంచి ఈనెల 21 వరకూ జరగనుంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా పండుగ 11,12 తేదీలు మినహా మిగిలిన 17 రోజుల్లో పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ రెండు సెషన్‌లలో పరీక్ష జరుగుతుంది. జిల్లాలో మొత్తం 11,566 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఒంగోలులోని బ్రిలియంట్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌, మంగమూరు డొంక జంక్షన్‌ సమీపంలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ చర్చ్‌ సోషల్‌ యాక్షన్‌ ఇండియా, మార్కాపురంలోని కృష్ణ చైతన్య ఇంజనీరింగ్‌ కాలేజీ, దరిమడుగులోని శామ్యూల్‌ జార్జి ఇంజనీరింగ్‌ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒకరు చొప్పున డిపార్ట్‌మెంట్‌ అధికారులుగా నలుగురు ఎంఈవోలను నియమించారు. డీఈవో కార్యాలయంలో ప్రత్యేకంగా టెట్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. నిర్దేశిత సమయానికి ఒక గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు.

Updated Date - Oct 03 , 2024 | 07:17 AM