Share News

సమష్టి కృషితోనే టీడీపీ గెలుపు

ABN , Publish Date - Jan 21 , 2024 | 03:11 AM

టీడీపీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి గెలుపునకు ముఖ్యమని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కోరారు.

సమష్టి కృషితోనే టీడీపీ గెలుపు

పొదిలి, జనవరి 20 : టీడీపీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి గెలుపునకు ముఖ్యమని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కోరారు. శనివారం పట్టణంలోని 6, 7, 8 వార్డుల్లో యూనిట్‌, బూత్‌కమిటీ ఇన్‌చార్జుల సభ్యులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి తిరగి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిం చాలన్నారు. అనంతరం 12వ వార్డులో బాబుష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల ముసుగులో ఓట్లను తొలగించే ప్రక్రియకు కంకణం కట్టుకొందన్నారు. టీడీపీ నాయకులు ఓటర్ల జాబితాపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే మహిళలకు గౌరవం, యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. అన్నదాతల సాదకబాదలను తెలిసిన చంద్రబాబునాయుడు వ్యవసాయదారులు ఇబ్బందులకు గురికాకుండా ఏటా వారిఖాతాల్లో రూ.20 వేల నగదు జమ చేయనున్నట్లు ప్రజలకు తెలపాల న్నారు. చంద్రబాబునాయుడిని గెలిపించుకుంటే వెలుగొం డ ప్రాజెక్ట్‌తోపాటు, మార్కాపురం జిల్లాను కూడా సాధించుకోవచ్చన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరే విధంగా నాయకులు, కార్యకర్తలు ప్రణాళిక ప్రకారం విభేధాలు విడనాడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, యూనిట్‌ సభ్యులు, బూత్‌కమిటీ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

కంభం : రాష్ట్రంలో బీసీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా అర్థవీడు మండలం మాగుటూరు గ్రామంలో ఆయన ఇంటింటికి పర్యటించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేనల ఉమ్మ డి మానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు, మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలకు చేసిన అన్యాయాలను ఖండిస్తూ యాచవరం గ్రామానికి చెందిన నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు మాగుటూరు గ్రామానికి చెందిన బీసీ నాయకులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఇరు గ్రామాలకు చెందిన బీసీలకు టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి బీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీని గద్దెదింపేందుకు టీడీపీ, జనసేన ఉమ్మడిగా చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. టీడీపీలో చేరిన వారిలో యాచవరం గ్రామ నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు లింగాల నాగయ్య, లింగాల బాలచెన్నయ్య, క్రిష్టాపురం రాములు, క్రిష్టాపురం చిన్నదాసయ్య, చిన్నరామయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట రామయ్య, లింగాల మస్తాన్‌, వెంకటచెన్నయ్య, దూదేకుల కాశయ్య, మాగుటూరుకు చెందిన షబ్బీర్‌, వెంకటేశ్వర్లు, రాములు, శ్రీను, రాజశేఖర్‌, రాజులయ్య, సునీల్‌కుమార్‌, సుధాకర్‌, అరవింద్‌, లక్ష్మయ్య, చిన్నరాజయ్య, విజయ్‌ కుమార్‌ తదితరులు చేరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులుయాదవ్‌, ప్రధాన కార్యదర్శి కొనతం రంగారెడ్డి, మాజీ ఎంపీపీ చేగిరెడ్డి చిన్నకాశిరెడ్డి, యాచవరం సర్పంచ్‌ పీరయ్య, వైస్‌ సర్పంచ్‌ కోడె పెద్దిరాజు, మాజీ సర్పంచులు బండి నారా యణరెడ్డి, కర్నం కాశయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యులు గంగుల పెద్దిరాజు, రంగయ్య, నాగకాశి పాల్గొన్నారు.

దుర్మార్గపు పాలనకు చమరగీతం పాడాలి

మార్కాపురం వన్‌టౌన్‌ : వైసీపీ దుర్మార్గపు పాలనకు చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమని వసంతలక్ష్మీ, నియోజకవర్గ పోల్‌మేనేజ్‌మెంట్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని 30వ వార్డులో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి తరుగుతూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. మహిళలకు మూడు సిలెండర్లు, తల్లికి వందనం కింద రూ.20వేలు మహిళలలకు ఉపయోగ పడతాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బృహత్తరమైన సూపర్‌ సిక్స్‌లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళా నాయకరాళ్లు పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : మండలంలోని కొల భీమునిపాడు గ్రామంలో శనివారం సాయంత్రం బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తండ్రి నారాయణరెడ్డి కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు జవ్వాజి రామానుజులరెడ్డి, బొగ్గు శేఖర్‌రెడ్డి, దూదేకుల మస్తాన్‌, నాగిరెడ్డి, సుబ్బారావు, నాయకులు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 03:11 AM