Share News

రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం ఖాయం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:38 AM

రాష్ర్టానికి టీడీపీ ప్రభంజనం వస్తోందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోనుందని నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు.

రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం ఖాయం

పెద్దదోర్నాల, ఏప్రిల్‌ 2: రాష్ర్టానికి టీడీపీ ప్రభంజనం వస్తోందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోనుందని నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని చిలకచెర్ల, చెర్లోపల్లి గ్రామాల్లో ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌బాబు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెంచు గిరిజనులు పెద్దఎత్తున పాల్గొని గూడూరిని స్వాగతించారు. అనంతరం ఆయన ఇంటింటికీ వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలు, బాబుష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీపై వివరించారు. సాయంత్రం యడవల్లి గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డి హాజరయ్యారు. గ్రామ ప్రజలు, నాయ కులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయభేరి మోగించనుందన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానున్నారని, అదే విధంగా ఈ నియోజకవర్గంలో తొలిసారి టీడీపీ జెండా ఎగురనుందన్నారు. కార్యకర్త లు, నాయకులు ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించ డంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంద న్నారు బీసీలకు శాస్వత కుల ధృవీకరణ పత్రా లుమంజూరు, బీసీ చట్టం అమలు చేయనున్న ట్లు వివరించారు. మాయమాటలు నమ్మొద్దని టీడీపీని ఆదరించాలని, సైకిలుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జున రెడ్డి, నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, కె శ్రీనివాసులు, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ భాష, చల్లా వెంకటేశ్వర్లు, ఎలకపాటి చంచయ్య, కె రాజేంద్ర,కొప్పుల సుబ్బారెడ్డి, షేక్‌ మంజూర్‌ భాష, మౌలాలి, రఫీ తదితరులు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల: ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా జనసేన, బీజేపీతో టీడీపీ కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొ న్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటన అనంతరం టీడీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వం అధికారం కోల్పోయే సమయంలోనూ పింఛన్లపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్‌ అందించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికి వెళ్లి రూ.4 వేలు పింఛన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 12:38 AM