Share News

బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యం

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:49 PM

తెలుగుదేశం పా ర్టీ బీసీలకు అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ఏ లూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం యద్దనపూడి మండలం పూనూరులో జరిగిన జయహో బీసీ సదస్సుకు గుదే తారకరామారావు అధ్యక్షత వహించారు.

బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యం
చినగంజాం: పల్లెపాలెం గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

యద్దనపూడి(మార్టూరు), ఏప్రిల్‌ 7: తెలుగుదేశం పా ర్టీ బీసీలకు అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ఏ లూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం యద్దనపూడి మండలం పూనూరులో జరిగిన జయహో బీసీ సదస్సుకు గుదే తారకరామారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ తెలు గుదేశం ప్రభుత్వం హయాంలోనే మహిళలను డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేసినట్టు చెప్పా రు. బీసీ కుటుంబాలలోని మధ్యతరగతి ప్రజానీకం కో సం ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తద్వారా చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగించేవారికి పని ముట్లను అందజేసినట్టు చెప్పారు. మొదటినుంచి తెలు గుదేశం పార్టీ బీసీ కుటుంబాల అభివృద్ధి, సంక్షేమం కో సం కృషి చేసిందన్నారు. మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీసీ కుటుంబాలు కృషి చే యాలన్నారు. అందరూ సమిష్టిగా పనిచేస్తేనే మన ఆశ యం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడగలమన్నా రు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కుటుం బాల అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రత్యేకంగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశ పెడతారన్నారు. వైసీపీ ప్రభు త్వంలో అన్నిరంగాలలో అభివృద్ధి అడుగంటి పోయింద న్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపకపోతే మ న బిడ్డల బంగారు భవిష్యత్తు అందకారంలోకి పోతుం దన్నారు. అందుకే ప్రతిఒక్కరూ చంద్రబా బు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేయాలన్నారు. కా ర్యక్రమంలో గుంజి వెంకట్రావు, నల్లపనేని రంగయ్య చౌదరి. శివరాత్రి శ్రీను, పోలూరి సింగయ్య, తుమ్మలపాటి రాఘవయ్య, పల్లపు అంకమ్మరావు, బోయ పాటి సాంబశివరావు, రావిపాటి సీతయ్య, సాంబశివ రావు, అంజిబాబు, కిషోర్‌, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన వైసీపీ బీసీ కుటుంబాలు

మార్టూరు, ఏప్రిల్‌ 7: మండలంలోని వలపర్ల గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులైన బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఆదివారం ఉదయం క్యాంపు కార్యాలయంలో బీసీ కుటుంబాలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ ఏలూరి పార్టీ కండువాలు మెడలో వేసి సాదరంగా ఆహ్వా నించారు. పార్టీలో చేరినవారిలో కుంచాల వాసు, కుంచాల శ్రీను, కుంచాల అనిల్‌, తన్నీరు అంకమ్మరావు, వెంకట్రావు, శ్రీను, తదితరులు ఉన్నారు. .

ఇంటింటికీ సూపర్‌సిక్స్‌ కరపత్రాల పంపిణీ

పర్చూరు, ఏప్రిల్‌ 7: పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గెలుపు కోసం కూటమి శ్రేణులు నేతృత్వంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం స్థానిక నెహ్రూ నగర్‌లో చేపట్టిన ప్రచారంలో ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. అభివృద్ధిని ఆకాంక్షించే ఏలూరి సాంబశివరావును అఽత్యధిక మెజార్జీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణారావు, కొల్లా శివరాంప్రసాద్‌, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, తలారి శివయ్య, జనసేన ప్రతినిధులు కారంపూడి సందీప్‌ తేజ, పండ్రా రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

మార్టూరు కాలనీల్లో ప్రచారం

మార్టూరు, ఏప్రిల్‌ 7: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాత్రి మార్టూరులో జనార్దన్‌ కాలనీ, సాయి నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో ను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఏలూరి సాంబశివరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరా రు. కార్యక్రమంలో కన్నెగంటి శ్రీనివాసరావు, జాష్టి సాం బశివరావు, తాటి నాగేశ్వరరావు, జంపని శ్రీను, కమ్మ శివనాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఏలూరి

చినగంజాం, ఏప్రిల్‌ 7: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విస్తృతంగా పర్యటించారు. ముందుగా స్థానిక టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం పల్లెపాలెం పంచాయతీ పరిధిలోని పెద్దపల్లెపాలెంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. సోపిరాలలో ఇటీ వల మృతి చెందిన తుమ్మలపెంట లక్ష్మమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. గ్రామానికి చెందిన శిఖరం సత్యనారాయణ, పర్వతరెడ్డి వెంకటనరసింహా రావు, శిఖరం శ్రీనివాసరావును పరామర్శించారు. మున్నంవారిపాలెంకు చెందిన వైసీపీ నాయకులు నిద్ర చలమారె డ్డి, కోకి తిరుపతిస్వామి, రాజు హరిబాబులురెడ్డి, ఆసోది మౌలాలి, కుక్కల శ్రీనివాస్‌రెడ్డి, కె.హేమంత్‌రెడ్డి, బోగిరెడ్డి ఆకాష్‌రెడి, గొల్లమూరి శివారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొద వీరయ్య, ఆజాద్‌, టి.జమరావు, నక్కల వెంకటనారాయణ, సందు శ్రీనివాసరావు, మోటుమర్రి రామసుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 10:49 PM