Share News

పల్లెల అభివృద్ధే టీడీపీ లక్ష్యం

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:10 PM

పల్లెల అభివృద్ధే టీడీపీ లక్ష్యమని డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మెటుపల్లి పంచా యతీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.

పల్లెల అభివృద్ధే టీడీపీ లక్ష్యం
వెలిగండ్ల: ఉగ్ర సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

కూటమి అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

50 వైసీపీ కుటుంబాలు పార్టీలో చేరిక

వెలిగండ్ల, ఏప్రిల్‌ 14: పల్లెల అభివృద్ధే టీడీపీ లక్ష్యమని డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మెటుపల్లి పంచా యతీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే గన్నవరం పంచాయతీలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు శ్వామల కాశిరెడ్డి, ముత్తిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, గవదకట్ల హరి, ఇం ద్రభూపాల్‌ రెడ్డి, చిలకల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని జగన్‌ తెగిన గాలిపటంలా మార్చారు..

కనిగిరి, ఏప్రిల్‌ 14: రాష్ట్రాన్ని జగన్‌మోహన్‌రెడ్డి తెగిన గాలిపఠంలా మార ్చారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మండలంలోని గురవాజిపేటలో ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో ఆదివారం ఎంపీ మాగుంట పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వ ర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని బల్లిపల్లి అడ్డరోడ్డు నుం చి గురువాజీపేట గ్రామం వరకు సాగిన భారీ బైక్‌ ర్యాలో పెద్ద ఎత్తున శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ మాగుంట, డాక్టర్‌ ఉగ్ర కుగ్రామగ్రామాన ప్రజలు అడుగడుగునా హారతులిస్తూ పూలతో ఘనస్వాగతం పలికారు. గురవాజీపేట గ్రామస్థులు డాక్టర్‌ ఉగ్ర, ఎంపీ మాగుంటను గజమాలతో స్వాగతం పలకగా పార్టీ శ్రేణులు పూల దండలతో ముంచెత్తారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, మాగుంట రాఘవ రెడ్డి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, నారపరెడ్డి(యడ వల్లి) శ్రీనివాసులురెడ్డి, ఉగ్ర తనయుడు జయసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే పల్లెలు సుభిక్షం

పీసీపల్లి, ఏప్రిల్‌ 14: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పల్లెలు సుభిక్షంగా ఉన్నాయని ఆపార్టీ నాయకులు అన్నారు. మండలంలో ని వెంగళాపురం, భట్టుపల్లి గ్రామాల్లో ఆదివారం బాబు ష్యూరిటీ-భవి ష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం వా రు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్ర భుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. గ్రామాలు అన్నిరంగా ల్లో అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడిని, కనిగిరి ఎమ్మెల్యేగా ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనంద రిపై ఉందన్నారు. కార్యక్రమంలో పువ్వాడి నాగరాజు, విజయ్‌, వీరపనేని పెద్దన్న, డబ్బుగొట్టు వెంకట్రావు, డబ్బుగొట్టు రవీంద్ర, ములకా నాగేశ్వ రరావు, తదితరులు పాల్గొన్నారు.

మాగుంట, ఉగ్రకు సన్మానం

పామూరు, ఏప్రిల్‌ 14: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీ నివాసులరెడ్డి, కనిగిరి నియోజకవర్గ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డిలను పా మూరు టీడీపీ శ్రేణులు శాలువలతో సత్కరించారు. సన్మానించిన వారిలో యువ పారిశ్రామికవేత్త యారవ శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యుడు ఆర్‌ ఆర్‌ రఫి, వార్డు మెంబర్‌ పిడుగు శ్రీనివాసులు, ముబినా మౌలాలి, వా యినేని రాఘవ, కావేరి రసూల్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 11:10 PM