పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలు టీడీపీకే సొంతం
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:39 AM
పార్టీని ప్రాణంగా భావించి పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే సొంతమని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శిలోని ఆమె నివాసం వద్ద శనివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక కార్యకర్తల బలం ఉన్న ఏకైక పార్టీ టీడీపీ మాత్రమే అన్నారు. గత ఎన్నికల్లో కార్యకర్తలు ప్రాణాలొడ్డి కూటమి విజయానికి కృషి చేశారని కొనియాడారు.
దర్శి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పార్టీని ప్రాణంగా భావించి పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే సొంతమని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శిలోని ఆమె నివాసం వద్ద శనివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక కార్యకర్తల బలం ఉన్న ఏకైక పార్టీ టీడీపీ మాత్రమే అన్నారు. గత ఎన్నికల్లో కార్యకర్తలు ప్రాణాలొడ్డి కూటమి విజయానికి కృషి చేశారని కొనియాడారు. వారి కష్టాన్ని పార్టీ మరచిపోదని, అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలను గుర్తించి గౌరవించటం జరుగుతుందని అన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దర్శి నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతంగా పూర్తి చేయాని విజ్ఞప్తి చేశారు. గతంలో కంటే రెట్టింపు సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సారఽథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి. సంక్షేమ పథకాలు శరవేగంతో అమలు జరుగుతున్నాయన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా తొలుత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లక్ష రూపాయల సభ్యత్వం తీసుకున్నారు. ఆ స్ఫూర్తితో దర్శి నగర పంచాయతీ చైర్మెన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు కలవకొలను చంద్రశేఖర్, దర్శి పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు దారం సుబ్బారావు లక్ష రూపాయల సభ్యత్వాలు తీసుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మెన్ పిచ్చయ్య, తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఒబుల్‌రెడ్డి, కూరపాటి శ్రీనివాసరావు, తెలుగు మహిళ నాయకురాళ్లు ఎం. శోభారాణి, ఎం. నాగమణి, టీడీపీ దర్శి పట్టణ క్లస్టర్ ఇన్‌చార్జి నారపుశెట్టి మధు, టీడీపీ నాయకులు సంగా తిరుపతిరావు, జూపల్లి కోటేశ్వరరావు, గుర్రం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.