రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనాన్ని ఆపలేరు
ABN , Publish Date - Jan 12 , 2024 | 01:13 AM
రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల ప్రభంజనం సృష్టిస్తాయని వాటి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలి పారు.

అర్థవీడు (కంభం), జనవరి 11 : రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల ప్రభంజనం సృష్టిస్తాయని వాటి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలి పారు. గురువారం అర్థవీడు మండలం నాగుల వరం గ్రామంలో నిర్వహించిన టీడీపీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి తన నిరంకుశ పాలనతో రాష్ట్రంలో నియంతృత్వంలోని నెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోచుకోవడ మే పనిగా పెట్టుకున్నాడన్నారు. వైసీపీ అవినీతి, దుర్మార్గ పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మండ్లమూడి ఆంజనే యులు, ప్రధాన కార్యదర్శి కొనతం రంగారెడ్డి, క్లస్టర్ యూనిట్ ఇన్‌చార్జిలు, మండల టీడీపీ ముఖ్యనాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు.
కంభం : టీడీపీ, జనసేన ఉమ్మడి మేని ఫెస్టోలోని అంశాలతో ప్రజల వద్దకు వెళ్లి మమేకం కావాలని గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్ ము త్తుముల అశోక్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు. కం భం పట్టణంలోని టీడీ పీ కార్యాలయంలో క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌చార్జ్‌లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాడితప్పిన రాష్ట్రాన్ని అభి వృద్ధి పథంలో నడపాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, ఇందులో ప్రతి ఒక్కరూ టీడీపీ కి మద్దతుగా నిలిచి కార్యకర్తలకు ఉత్సాహం నింపా లన్నారు. ప్రతి ఒక్కరిని కలిసి మిని మాని ఫెస్టోలోని అంశాలను వివరించాలన్నారు. కార్య క్రమంలో మండల టీడీపీ నాయకులు, క్లస్ట ర్ ఇన్‌చార్జిలు, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు, పార్ల మెంటు నాయకులు, పాల్గొన్నారు.