Share News

టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:31 AM

తెలు గుదేశం పార్టీ సభ్వత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవం తం చేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని, ఎంపీ మా గుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పిలు పునిచ్చారు.

 టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల పిలుపు

ఒంగోలు కార్పొరేషన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలు గుదేశం పార్టీ సభ్వత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవం తం చేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని, ఎంపీ మా గుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పిలు పునిచ్చారు. శనివారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో పండుగ వాతావరణంలో సభ్వత్వ నమోదును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తొలి స భ్యత్వాన్ని ఎంపీ మాగుంటకు ఎమ్మెల్యే దామచర్ల అందజే శారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ రాష్ట్రవ్యా ప్తంగా 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారన్నారు. అలాగే ఒంగో లు నియోజకవర్గంలో దామచర్ల ఆధ్వర్యంలో తాను సభ్య త్వాన్ని స్వీకరించడం సంతోషంగా ఉందని చెప్పారు. అనం తరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలన్నారు. సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తకు, వారి కుటుంబానికి భరోసా లభిస్తుందని తెలిపారు. గతం లో ప్రమాద బీమా రూ.2లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.5 లక్షలకు పెంచారని, అలాగే ఎవరైనా మరణిస్తే తక్షణ సహా యం కింద రూ.10వేలు అందిస్తారన్నారు. మన పార్టీ-మన సభ్వత్వం అనేలా అందరూ విజయవంతం చేయాలని కో రారు. కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, దామచర్ల అనీషా, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 01:31 AM