టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి
ABN , Publish Date - Oct 26 , 2024 | 12:46 AM
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు. దర్శిలోని ఆమె నివాసం వద్ద శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయినాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.
దర్శి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి) : టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు. దర్శిలోని ఆమె నివాసం వద్ద శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయినాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే ప్రతి కార్యకర్తకూ ధైర్యం, భరోసా ఉంటుందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ఆవిర్భవించిన టీడీపీ.. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఒక పక్క పార్టీ బ లోపేతం కావటంతో పాటు మరో పక్క రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఇక నుంచి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు.
సీఎం రిలీ్‌ఫఫండ్ చెక్కులు పంపిణీ
బాధిత కుటుంబాలకు డాక్టర్ లక్ష్మీ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సీహెచ్ సీతారామయ్యకు రూ. 2లక్షలు, పోకూరి నాగపావనికి రూ. 35,508, బేతంశెట్టి శివకు రూ.30,786 చెక్కులను ఆమె అందజేశారు.