Share News

టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:16 AM

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడం ఖాయమని ఆ పార్టీ టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం

ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి 29 : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడం ఖాయమని ఆ పార్టీ టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరి పనిచేసే కేడర్‌కు కూడా పూర్తి గౌరవ మర్యాదలతో తగు ప్రాధాన్యత ఇస్తామన్నారు. టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయించి ప్రారంభిస్తామన్నారు. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామన్నారు. అర్హులైన పేదలకు ఆరు గ్యారెంటీలు అమలుజేస్తామన్నారు. నియోజకవర్గంలో నాలుగేళ్లగా నీళ్లు తోలిన వైసీపీ సర్పంచులు, కాంట్రాక్టర్లే రోడ్డెక్కారన్నారు. దీంతో సొంత పార్టీ కేడరే రాస్తారోకో చేసిందన్నారు. ఇక వీరు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన పోత్తులో ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, యేర్వ మల్లికార్జునరెడ్డి, మేకల వలరాజు, శ్రీనివాసరెడ్డి, పయ్యావుల ప్రసాదు, టీడీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, బూత్‌ కమిటి కన్వీనర్లు,గ్రామ కమిటి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

టీడీపీలో భారీగా చేరికలు

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం మండల కేంద్రం లో వైసీపీ నుంచి 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎర్రగొండపాలెం మూడో ఎంపీటీసీ సభ్యురాలు కాయకాకుల సత్యావతి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. 2024 ఎన్నికలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన ఎన్నికల మెనిఫెస్టోను ఆకర్షితురా లై టీడీపీలో చేరినట్లు సత్యవతి చెప్పారు. ఆమె భర్త కాయకాకుల సుబ్బయ్య ఆధ్వర్యంలో 20కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. వైసీపీ యువ నాయకుడు ఒంగో లు ఆదిరెడ్డితో పాటు ఆయన ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. కంచర్ల వెంకటయ్య గౌడ్‌ ఆధ్వర్యం లో 10 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. యువనాయకుడు ఒంగోలు ఆదిరెడ్డి మాట్లాడుతూ వైసీపీలో 10 సంవత్సరాలుగా సేవలు చేశామని, ఒక్క పని కూడ జరగలేదని, అందుకే టీడీపీలో చేరినట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబును అధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఒంగోలు ఆదిరెడ్డితో పాటు కోటా వెంకటరెడ్డి, కోటా చిన్న వెంకటరెడ్డి, పఠాన్‌ నాసర్‌ఖాన్‌ టీడీపీ చేరారు.టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

శంఖారావం సభను విజయంతం చేయండి

ఎర్రగొండపాలెం : నారా లోకేష్‌ నేతృత్వంతో మార్చి 3న జరిగే విజయశంఖారావం సభను కార్యకర్తలు జయప్రదం చేయాలని ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్‌బాబు సూచించారు. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 3న త్రిపురాంతకం మండలం బోడిరెడ్డి జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన సభ నిర్వహించను న్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సభ విజయవంతానికి కృషిచేయాలని కోరారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాలలోని గ్రామాల ప్రజలకు దగ్గరగా ఉండేవిధంగా జాతీయ రహదారి బోడిరెడ్డిపల్లె జంక్షన్‌ వద్ద సభా వేదిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో 265 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయని 25 వేల మంది ప్రజలు సభకు రావాలని, కార్యకర్తలు ప్రజలను చైతన్య వంతం చేయాలని అన్నారు.

మార్కాపురం రూరల్‌ : మండలంలోని బోడపాడు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు విఘ్నేష్‌ రెడ్డి, నియోజకవర్గం పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి తనయుడు కందుల రోహిత్‌రెడ్డి, నాయకులు నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివ రించారు. ఈ సందర్భంగా విఘ్నేష్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కష్టాలు తీరాలంటే టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జవ్వాజి రామానుజలరెడ్డి, బోడపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొగ్గు శేఖర్‌రెడ్డి, గూడా రమణారెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీతోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం

కొమరోలు : బడుగు బలహీనవర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని ఎంపీటీపీ మాజీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని తాటిచర్ల, హసనాపురం, పామూరిపల్లి గ్రామంల్లో ‘బాబు ష్యూరిటీ-భవిషత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రాత్రి నిర్వహిం చారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమం చంద్రబాబుకే సాధ్యమ న్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా అరాచక వైసీపీ ప్రభుత్వానికి తగినబుద్ధి చెప్పి మన గిద్దలూరు టీడీపీ అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి గెలిపించుకుందామన్నారు. రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి రాక్షస పాలన చేస్తున్న జగన్‌రెడ్డి పని అయిపోయిందన్నారు. కార్యక్రమానికి మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని ఇంటిటికి తిరిగి ‘బాబు ష్యూరిటీ-భవిషత్తుకు గ్యారెంటీ’ కరపత్రాలను పంపిణీచేశారు. కార్యక్రమంలో టీడీపీ బోనేని వెంకటేశ్వర్లు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు బిజ్జాల తిరుమలరెడ్డి, సీనియర్‌ నాయకులు బిజ్జం వెంకట్రామిరెడ్డి, నాయకులు మాజీ సర్పంచ్‌ చిన్నావుల తిరుమలరెడ్డి, అంబావరపు భాస్కర్‌రెడ్డి, పోలెబోయిన మద్దిలేటి, జనార్ధన్‌రెడ్డి, ఏలూరి చిన్నసుబ్బయ్య, వీరంరెడ్డి కృష్ణమోహన్‌రెడ్డి, మారంరెడ్డి వీర నారాయణరెడ్డి, మారంరెడ్డి ఈశ్వరరెడ్డి, మేముల రమణయ్య, బీసీ నాయకులు పందరబోయిన గోపాలకృష్ణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:16 AM