Share News

ముమ్మరంగా టీడీపీ ప్రచారం

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:23 AM

టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దర్శి పట్టణంలోని 18వ వార్డులో శనివారం టీడీపీ కూటమి అభ్య ర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె ఇంటింటికీ తిరిగి ప్ర జల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒం గోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ముమ్మరంగా టీడీపీ ప్రచారం
తూర్పుకంభంపాడులో ప్రచారం నిర్వహిస్తున్న డాక్టర్‌ లక్ష్మి

ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న కూటమి అభ్యర్థి డాక్టర్‌ లక్ష్మి

నీరాజనాలు పలుకుతున్న ప్రజలు

దర్శి, ఏప్రిల్‌ 6 : టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దర్శి పట్టణంలోని 18వ వార్డులో శనివారం టీడీపీ కూటమి అభ్య ర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె ఇంటింటికీ తిరిగి ప్ర జల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒం గోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ ఇంటి ఆడపడుచుగా మీ వద్దకు వచ్చానని తనను ఆదరిస్తే మీకు అండగా ఉంటానని లక్ష్మి భరోసా ఇచ్చా రు. ఈ సందర్భంగా అధికసంఖ్యలో మహిళలు లక్ష్మికి ఘనస్వాగతం పలికారు. పూలవర్షం కురిపించడంతో పాటు శాలువాలు కప్పి సన్మానించారు. లక్ష్మి మహిళలతో ఆప్యాయంగా మా ట్లాడారు. పలు ఇళ్ల వద్ద వృద్ధులతో కలిసి కూ ర్చొని మాట్లాడారు. దివంగత మాజీ మంత్రి హనుమంతరావు మనవరాలు పోటీ చేస్తుండడం తమకు సంతోషంగా ఉందని పలువురు వృద్ధులు వివరించారు. అంతకముందు లక్ష్మి, ఆమె భర్త డాక్టర్‌ లలిత్‌ సాగర్‌ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు కలవకొలను చంద్రశేఖర్‌, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు దారం సుబ్బారావు ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. ప్రచార కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిలర్‌ దారం నాగవేణి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణరెడ్డి, జనసేన దర్శి పట్టణ అధ్యక్షుడు సీహెచ్‌ కొండయ్య, పోగ్రాం కోఆర్డినేటర్‌ పసుపులేటి చిరంజీవి కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ఆశీర్వదించి గెలిపించండి : డాక్టర్‌ లక్ష్మి

ముండ్లమూరు : మా తాత మాజీ మంత్రి, స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు, మా నాన్న స్వర్గీయ గొట్టిపాటి నర్సయ్య కన్న కలల ను, వారు ముండ్లమూరు మండలానికి చేసిన సేవలను గుర్తుంచుకొని మీ ఆడ పడుచుగా నన్ను ఆశీర్వదిస్తే జీవితాంతం రుణపడి మీకు సేవ చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆమె శనివారం మండలంలోని తూర్పుకంభంపాడు, భ ట్లపల్లి, నూజెండ్లపల్లి, సుంకరవారిపాలెం గ్రా మాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా తూర్పుకంభంపాడులో నారాయణ స్వా మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రా మంలో పలు వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓ టరతో మాట్లాడుతూ గొట్టిపాటి కుటుంబం అంటే సేవ చేసే కుటుంబం అని మీలో నమ్మ కాన్ని వమ్ము చేయమన్నారు. తాను దర్శిలోనే ఉండి పేద ప్రజల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ సేవలందిస్తానన్నారు. 40 సంవత్సరాలుగా గొట్టిపాటి కుటుంబం మీతో కలసి ఉందన్నారు. ఒక్కసారి మాట ఇస్తే నిల బెట్టుకుంటామన్నారు. ఆమెకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తాను లోకల్‌ కాదని ప్రచారం చేసే వైసీపీ నాయకులకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలన్నారు. ముండ్లమూరు మండలం అంటే తన తాతకు, తన తండ్రికి, తన బాబాయికి ఎంతో అభిమానం ప్రజల గుండెల్లో కూడు కట్టుకుందన్నారు. కా ర్యక్రమంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీలు కొక్కెర నాగరాజు, వరగాని పౌలు, మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, వీరపనేని రంగా, చాగంటి హనుమంతరావు, చాగంటి రాంబాబు, సర్పంచ్‌ కూరపాటి నారాయణ స్వామి, మారెళ్ళ ఎంపీటీసీ పాలపర్తి సుబ్బారావు, గోరంట్ల వీరాంజనేయులతో పాటు పలుగ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:23 AM