Share News

కొండమంజులూరు విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Aug 13 , 2024 | 11:44 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాపట్లలో విద్యాశాఖ నిర్వహించిన వక్తృత్వ, క్విజ్‌ పోటీలలో కొండమంజులూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథములుగా నిలిచారు. జీవవైవిద్య పరిరక్షణలో యువత పాత్ర అనే అంశంపై జరిగిన వక్తృత్వ పోటీలో పాల్గొన్న కొండమంజులూరు ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని యల్లంకి సంధ్యారాణి ప్రతిభ కనబరిచి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది.

కొండమంజులూరు విద్యార్థుల ప్రతిభ
సంధ్యారాణి, పవన్‌ గోపీకృష్ణ, హితేంద్ర

పంగులూరు, ఆగస్టు 13 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాపట్లలో విద్యాశాఖ నిర్వహించిన వక్తృత్వ, క్విజ్‌ పోటీలలో కొండమంజులూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథములుగా నిలిచారు. జీవవైవిద్య పరిరక్షణలో యువత పాత్ర అనే అంశంపై జరిగిన వక్తృత్వ పోటీలో పాల్గొన్న కొండమంజులూరు ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని యల్లంకి సంధ్యారాణి ప్రతిభ కనబరిచి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు ఛాతరాజుపల్లి పవన్‌ గోపీకృష్ణ, పంచుమర్తి హితేంద్ర క్విజ్‌ పోటీలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ విద్యార్థులకు ఈనెల 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలో కలెక్టర్‌ ప్రశంసాపత్రం, నగదు బహుమమతులను అందజేస్తారని హెచ్‌ఎం ఐ.అణిత తెలిపారు. జిల్లా స్థాయి పోటీలలో సత్తాచాటి పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులను ఎస్‌ఎంసీ చైర్మన్‌ గోలి సంధ్య, వైస్‌ చైర్మన్‌ నరసింహారావు, ఉపాధాయయులు, సిబ్బంది అభినందించారు.

Updated Date - Aug 13 , 2024 | 11:44 PM