Share News

వలంటీర్లకు, వీవోఏలకు తాయిలాలు

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:44 PM

అధికార పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోంది. తమ గెలుపునకు పనిచేయాలని వలంటీర్లకు, వీవోఏలకు తాయిలాలు అందజేస్తోంది. కొన్నిచోట్ల అంగన్‌వాడీ కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సన్నాహాలను ముమ్మరం చేస్తున్నారు. మధ్యవర్తులుగా వలంటీర్లను, వైకేపీలో పనిచేస్తున్న వీవోఏలను వినియోగించుకుందుకు ఎర వేస్తున్నారు.

వలంటీర్లకు, వీవోఏలకు తాయిలాలు
వైసీపీ నాయకులు పంపిణీ చేసిన డిన్నర్‌ బాక్సులను తీసుకెళ్తున్న వీవోఏలు

గెలుపు కోసం వలంటీర్లకు, వీవోఏలకు తాయిలాలు వైసీపీ అభ్యర్థుల దొడ్డిదారి వ్యూహాలు

వారితో ఓటర్లకు నగదు పంపిణీకి సన్నాహలు

కట్టడి చేయాలని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి

దర్శి, మార్చి 14 : అధికార పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోంది. తమ గెలుపునకు పనిచేయాలని వలంటీర్లకు, వీవోఏలకు తాయిలాలు అందజేస్తోంది. కొన్నిచోట్ల అంగన్‌వాడీ కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సన్నాహాలను ముమ్మరం చేస్తున్నారు. మధ్యవర్తులుగా వలంటీర్లను, వైకేపీలో పనిచేస్తున్న వీవోఏలను వినియోగించుకుందుకు ఎర వేస్తున్నారు. వలంటీర్లకు రూ.5వేలు నగదు, డిన్నర్‌ సెట్‌, వాటర్‌ బాటిల్‌ను బహుమతులుగా వైసీపీ అభ్యర్థులు అందజేస్తున్నారు. వీవోఏలకు కూడా డిన్నర్‌ సెట్లు పంపిణీ చేశారు. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ఇప్పటికే పంపిణీ పూర్తయింది. మిగిలిన మండలాల్లో కూడా దశలవారీగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. అనేకచోట్ల ఏకంగా వైకేపీ కార్యాలయాల్లోనే గిఫ్ట్‌ల నిల్వలను ఉంచినట్లు సమాచారం. ముందుగా వారిని సంతృప్తిపరచి వారి ద్వారా ఓటర్లకు డబ్బులు, మద్యంను పంపిణీ చేసేందుకు వ్యూహాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వలంటీర్లు, వీవోఏలలో చాలామందికి తాయిలాలు అందాయి. మిగిలిన వారికీ అందజేసి ఆ తర్వాత ఓటర్లకు తాయిలాలు అందజేసేందుకు వీరిని వాడుకోనున్నారు. కాగా కొంతమంది వీవోఏలు తాయిలాలు తీసుకునేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇదిలావుండగా ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా వైసీపీ నేతలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే అక్రమాలు జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలి.

బహుమతుల మోత

పీసీపల్లి, మార్చి 14 : ఎన్నికల్లో వలంటీర్లను వాడుకునేందుకు వారికి ఆకర్షణీయమైన బహుమతులను పంచుతున్నారు. గురువారం స్థానిక స్త్రీశక్తి భవనంలో వైసీపీ నాయకులు వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. 4వవిడత చేయూత చెక్కుల పంపిణీ అని వీవోఏలను పిలిచారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చిన వైసీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ వలంటీర్లు, వీవోఏలతో మాట్లాడారు. అనంతరం మొయిలేని విధంగా బహుమతులను అందజేశారు.

Updated Date - Mar 14 , 2024 | 11:44 PM