Share News

తహసీల్దార్‌ లేక ప్రజల ఇక్కట్లు

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:04 AM

తహసీల్దార్‌ కార్యాల యంలో రెండు నెలలుగా తహసీల్దార్‌ లేకపోవ డంతో ప్రజలు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

తహసీల్దార్‌ లేక ప్రజల ఇక్కట్లు

కొమరోలు, మార్చి 11 : తహసీల్దార్‌ కార్యాల యంలో రెండు నెలలుగా తహసీల్దార్‌ లేకపోవ డంతో ప్రజలు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతులు తాము తీసుకున్న రుణాలను రెన్యూవల్‌ చేసుకునేందుకు 1బీ, అడంగళ్లు అవసరం. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ ఆర్మీ ఉద్యోగాలకు పచ్చజెండా ఊపింది. దీంతో అవసరమైన కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం పింఛనుదారులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

కొమరోలు మండలం తహసీల్దార్‌గా పనిచేసిన రమాదేవిని ఎన్నికల నేపథ్యంలో నెల్లూరుకు బదిలీ చేశారు. అప్పటి నుంచి కొమరోలుకు తహసీల్దార్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కలెక్టర్‌ కొమరోలు తహసీల్దార్‌గా చంద్రశేఖర్‌రావును నియ మించారు. అయితే ఆ యన విధుల్లో చేర లేదు. దీంతో బేస్తవారపేట తహసీల్దార్‌ పద్మావతిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. అయితే ఆమె కేవలం ఎన్నికల విధులకు మాత్రమే పరిమితం అయ్యారు. విద్యార్ధులకు అవసమైన కులం, ఆదాయం, ఈబీసీ ధ్రువపత్రాలు, రైతులకు అవసరమైన భూసమస్యల గురించి పట్టించు కోవడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు 196 వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. సుమారు 200లకు పైగా భూసమస్యలు పెండింగులో ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్ధులకు అన్ని ప్రవేశ పరీక్షలకు ఇటీవలె విడుదలైన ఆర్మీ ఉద్యోగాలకు అవసమైన ధ్రువీకరణ పత్రాల కోసం సచివాలయాల్లోను, మీసేవా కేంద్రాల్లోనూ ధరఖాస్తులు చేసుకున్నారు. బ్యాంకుల్లో తీసుకు న్న రుణాలను రెన్యూవల్‌ చేసుకునేందుకు అవసరమైన 1బీ, అడంగళ్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్ల కోసం కోసం తహసీల్దార్‌, సచివాలయ చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవలె కొమరోలుకు డిప్యూటీ తహసీల్దార్‌ మల్లిఖార్జున ఇటీవలె వచ్చారు. ఆయన ధ్రువీకరణ పత్రాల సంతకాల కోసం బేస్తవారిపేటకు పంపినా ఇప్పటికి సంతకాలు కాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ విషయమై మండలంలోని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదు. తక్షణమే కొత్త తహసీల్దార్‌ నియమించడం కానీ, డీటీ ద్వారా కానీ విద్యార్థులకు, రైతులకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 01:04 AM