Share News

సొసైటీలో స్వాహాపర్వం

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:16 AM

కొమరోలు విశాల వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. సొసైటీ నిధులు రూ.80.26 లక్షలు స్వాహా అయ్యాయి. లావాదేవీల్లో అడుగడుగునా అక్రమలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటికీ సీఈవో రావూరి దిలీ్‌పకుమార్‌ కేంద్రబిందువుగా నిలిచారు. సొసైటీ నిధులను సీఈవో యథేచ్ఛగా సొంతానికి వాడేసుకున్నారు.

సొసైటీలో స్వాహాపర్వం
సొసైటీ కార్యాలయం

కొమరోలు సహకార సంఘంలో భారీ కుంభకోణం

రూ.80.26 లక్షలు గోల్‌మాల్‌

సొంతానికి వాడేసుకున్న సీఈవో

విచారణలో వెలుగు చూసిన వైనం

చర్యలకు డీసీవో ఆదేశం

ఒంగోలు (విద్య), మార్చి 10 : కొమరోలు విశాల వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. సొసైటీ నిధులు రూ.80.26 లక్షలు స్వాహా అయ్యాయి. లావాదేవీల్లో అడుగడుగునా అక్రమలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటికీ సీఈవో రావూరి దిలీ్‌పకుమార్‌ కేంద్రబిందువుగా నిలిచారు. సొసైటీ నిధులను సీఈవో యథేచ్ఛగా సొంతానికి వాడేసుకున్నారు. సొసైటీ నిర్వహించిన ఎరువుల వ్యాపారంలో అక్రమాలు, శనగలు కొనుగోలు చేసి ఇష్టారాజ్యం గా బహిరంగ మార్కెట్‌లో విక్రయించి దిగమింగారు. రు ణాలకు సం బంధించి రైతు ల నుంచి వ సూలు చేసిన సొమ్మును బ్యాంకులో జ మ చేయకుం డా స్వాహా చేశా రు. సూపర్‌ మార్కెట్‌ వ్యవహారంలోనూ నిధులు స్వాహా చేశారు. సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గిద్దలూరు సబ్‌ డివిజనల్‌ సహకారాధికారి చేపట్టిన విచారణలో నిధులు స్వాహా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై డీసీవో సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా పొదిలి సబ్‌ డివిజనల్‌ సహకారాధికారి కె.వెంకటేశ్వర్లును నియమించారు. దీన్ని అడ్డుకొనేందుకు సీ ఈవో చేయని ప్ర యత్నాలు లేవు. రాజకీయంగా, న్యాయపరంగా చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది. విచారణ చేపట్టడతో అవినీతి బా గోతం వెలుగులోకి వ చ్చింది. 80.26 లక్షలు దిగమింగినట్లు తేలింది.

అక్రమాల్లో మచ్చుకు కొన్ని.

సొసైటీలో 41 మంది రైతుల నుంచి రూ.29.64 లక్షలు వసూలు చేసి ఆ మొత్తాన్ని నగదు పుస్తకాల్లో నమోదు చేయకుండా, బ్యాంకులో జమ చేయకుండా సీఈవో దిగమింగారు. బకాయిలు చెల్లించిన రైతులకు సొసైటీ రసీదులు ఇవ్వకుండా తెల్లకాగితం మీద స్టాంపులు అంటించి ఇచ్చారు.

రైతులు రెండోసారి చెల్లించిన బకాయిలు రూ.8.75 లక్షలు సొసైటీ నగదు పుస్తకంలో రాయకుండా, బ్యాంకులో జమ చేయకుండా సీఈవో స్వాహా చేశారు.

రైతుల వ్యవసాయ రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లింపు కోసం వసూలు చేసిన రూ.1.78 లక్షలు సొంతానికి వాడుకున్నారు.

సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన శనగల విక్రయంలో కూడా గోల్‌మాల్‌ జరిగింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగలు నేరుగా మార్క్‌ఫెడ్‌కు విక్రయించకుండా కొన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని ఆ మొత్తాలు రైతులకు చెల్లించకుండా దిగమింగారు. రైతులు ఒత్తిడి చేయడంతో సీఈవో వారికి చెక్కులు ఇవ్వగా అవి బౌన్స్‌ అయ్యాయి. ఈవిధంగా రూ.7.24లక్షలు స్వాహా చేశారు.

మార్క్‌ఫెడ్‌ నుంచి రూ.15.55 లక్షల ఎరువులు కొనుగోలు చేసి వాటిలో కొంత మొత్తం అసలు సొసైటీకి చేరకుండా నే బయట విక్రయించారు. దీనికి సంబంధించి మార్క్‌ఫెడ్‌కు రూ.2.50 లక్షలు జమ చేశారు ఈ వ్యాపారంలో 2.52 లక్షలు స్వాహా చేశారు అదేవిధంగా సొసైటీలో నిల్వ ఉన్న నగదులో రూ.4.49 లక్షలు సొంతానికి వాడుకున్నారు.

సొసైటీ అధ్వర్యంలో నిర్వహించిన సూపర్‌ మార్కెట్‌ లావాదేవీల్లోనూ అక్రమాలకు పాల్పడి లక్షల రూపాయలు దోచుకున్నారు. సూపర్‌ బజారు స్టాక్‌ నిల్వలో తేడా వలన రూ.5.49 లక్షలు, బయటి వ్యక్తులకు విక్రయించి సొసైటీకి జమ కాని మొత్తం రూ.3.50 లక్షలు, సూపర్‌ మార్కెట్‌ రూము రెంటు రెండు లక్షలు, రెంట్‌ అడ్వాన్స్‌ రూ.1.50 లక్షలు స్వాహా చేశారు.

సొసైటీకి జమ అయిన మొత్తాలను ఖర్చుగా చూపించి రూ.46,260 సొంతానికి వాడుకున్నారు.

పాలకవర్గం అనుమతి లేకుండా, జీతాల పే బిల్లుల ఎంట్రీలు లేకుండా రూ.2.46 లక్షలు డ్రా చేసి దిగమింగారు.

సొసైటీకి తనఖా పెట్టిన 26,842 బాండ్లు వాయిదా, గడువు మీరిపోవడంతో సంస్థకు నష్టం వాటిల్లింది.

తగు చర్యలకు ఆదేశం

కొమరోలు సొసైటీలో జరిగిన కుంభకోణంపై జిల్లా సహకారాధికారి పోలిశెట్టి రాజశేఖర్‌ను వివరణ కోరగా అక్కడ నిధులు దుర్వినియోగం వాస్తవమేనని ధ్రువీకరించారు. తగు చర్యలు తీసుకోవాలని మార్కాపురం డివిజనల్‌ సహకారాధికారిని ఆదేశించినట్లు చెప్పారు. నిధులను సంబంధిత వ్యక్తులనుంచి రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని రాజశేఖర్‌ తెలిపారు.

Updated Date - Mar 11 , 2024 | 12:16 AM