Share News

వేసవి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఎంతో మేలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:11 PM

వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడ్డాయని ఈవోపీఆర్‌డీ బాలకృష్ణ అన్నారు.

వేసవి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఎంతో మేలు

మార్కాపురం వన్‌టౌన్‌, జూన్‌ 3: వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడ్డాయని ఈవోపీఆర్‌డీ బాలకృష్ణ అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో కోడి రామ్మూర్తి క్రీడా సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తర్లుపాడు ఎంపీడీవో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. వేసవి సెలవులు వృథా కాకుండా విద్యార్థులు వారికి నచ్చిన అంశాలలో శిక్షణ పొంది మానసిక, శారీరక పరిపక్వతకు పునాదు లు వేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. విద్యార్థులు నిర్వహించిన జనపద గేయాలు, దేశ భక్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు ముత్తోజు సుధాకర్‌, బాక్సింగ్‌ కోచ్‌ పి.వేణు, డాక్టర్‌ ఎం.మాధవరావు, పిన్నిక శివ, కోడి రామ్మూర్తి క్రీడా సాంస్కృ తిక సేవా సంఘం అధ్యక్షులు పిన్నిక నాగేశ్వరరావు, కార్యదర్శి కాళంగి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

చదరంగం ద్వారా ఏకగ్రత పెంపు

మార్కాపురం వన్‌టౌన్‌ : చదరంగం ద్వారా ఏకగ్రత పెరుగు తుందని గ్రంథపాలకుడు జీవీ శివారెడ్డి అన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు చిత్ర లేఖనం, చదరంగంలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నెల 6న ముగింపు సభ నిర్వహించి విద్యార్థు లకు ధ్రువపత్రాలు అందిస్తామని శివారెడ్డి తెలి పారు.

Updated Date - Jun 03 , 2024 | 11:11 PM