Share News

వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:37 AM

గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 25 : గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి రోజురోజుకు టీడీపీలోకి వలసలు కొనసాగు తున్నాయి. బుధవారం టీడీపీ అభ్యర్థి ముత్తు ముల అశోక్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి ఊహించని విధంగా, ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో నియోజకవర్గంలో రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. సుమారు 40వేల మంది వరకు కార్యక్రమానికి హాజరైనట్లు అంచనా. దీంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. తాజాగా గురువారం స్థానిక టీడీపీ కార్యాల యంలో బేస్తవారపేట మండలం బసినేపల్లి గ్రామసర్పంచ్‌ వినుకొండ బుచ్చి బాబు, ఆయన అనుచరులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి అశోక్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి స్థానిక సంస్థలను నిధులు లే కుండా నిర్వీర్యం చేశారని విమర్శిం చారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో తెల్లగొల్ల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, జొన్న జేమ్స్‌, పగ్గాల రాము ఉన్నారు. పూనూరు భూపాల్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

బేస్తవారపేట మండలం పిటకాయగుళ్ల గ్రామానికి చెందిన బీసీ నాయకుడు పేరూరి బాలయ్య వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎన్‌డీఏ కూటమి అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే పార్టీ అని బాలయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:37 AM