Share News

పోటీలలో ప్రతిభ చాటిన ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు

ABN , Publish Date - Nov 26 , 2024 | 11:17 PM

రాజ్యాంగ్‌ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు ఉర్దూ హైస్కూల్లో నిర్వహించిన పోటీలలో చీరాల ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చాటారు. పలు పోటీలలో విజేతలుగా నిలిచారు.

పోటీలలో ప్రతిభ చాటిన ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు
విద్యార్థులను అభినందిస్తున్న ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌

చీరాల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగ్‌ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు ఉర్దూ హైస్కూల్లో నిర్వహించిన పోటీలలో చీరాల ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చాటారు. పలు పోటీలలో విజేతలుగా నిలిచారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులను మంగళవారం మోడల్‌ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జె.సరళ, ఉపాధ్యాయులు అభినందించారు. పాటల పోటీలలో కె.మనస్వని (ప్రథమ), క్విజ్‌ పోటీలో పీవీఎన్‌ఎ్‌స సంతోష్‌ (ప్రథమ), డిబేట్‌లో ఏ.అభిషేక్‌, ఆర్‌.అభిషేక్‌ రెండో స్థానంలో నిలిచారన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థాయిలో ఈ జోనల్‌ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. స్కూల్‌ తరపున ప్రత్యేక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 11:17 PM