Share News

బెడిసికొడుతున్న వైసీపీ వ్యూహాలు

ABN , Publish Date - May 07 , 2024 | 01:18 AM

ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఉద్యోగుల్లో లభించని ఆదరణ... పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ తటస్థ ఓటర్లలో బయటపడుతున్న ప్రభుత్వ వ్యతిరేకత... అంటీముట్టనట్లుగా ఉన్న సొంత పార్టీలోని అసమ్మతివాదులు.. క్రమేపీ దూరమవుతున్న ఓటర్లు... ఇదీ ప్రస్తుతం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల పరిస్థితి. ఓటమి భయంతో బెంబేలెత్తుతున్న అధికార పారీ నేతలు ఓటర్లకు వారం ముందుగానే నగదు పంపిణీకి తెరలేపింది.

బెడిసికొడుతున్న వైసీపీ వ్యూహాలు

ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో పంపిణీకి ప్రయత్నం

ఓటర్లకూ అంతే ఇవ్వాలంటూ శ్రేణుల డిమాండ్‌

ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిపై అభ్యర్థుల కస్సుబుస్సు

ఒంగోలులో భారీ ప్రలోభాలకు తెరతీసిన వైసీపీ

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఉద్యోగుల్లో లభించని ఆదరణ... పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ తటస్థ ఓటర్లలో బయటపడుతున్న ప్రభుత్వ వ్యతిరేకత... అంటీముట్టనట్లుగా ఉన్న సొంత పార్టీలోని అసమ్మతివాదులు.. క్రమేపీ దూరమవుతున్న ఓటర్లు... ఇదీ ప్రస్తుతం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల పరిస్థితి. ఓటమి భయంతో బెంబేలెత్తుతున్న అధికార పారీ నేతలు ఓటర్లకు వారం ముందుగానే నగదు పంపిణీకి తెరలేపింది. ఉద్యోగుల ఓట్లకు ఎక్కువ మొత్తం డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించిన వైసీపీకి అదే శాపంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు, దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.5వేల ప్రకారం చెల్లించే ప్రక్రియను వైసీపీ ప్రారంభించింది. ఒంగోలులో వేసిన ఓటును సెల్‌ఫోన్‌ ఫొటో ద్వారా చూపించగలిగితే మరో రూ.5 వేలు అదనంగా ఇస్తామని కూడా వైసీపీ నాయకులు చెప్పారు. ఇది గమనించిన టీడీపీ నాయకులు సోమవారం మధ్యాహ్నం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆతర్వాత ఆయన పోలింగ్‌ కేంద్రాలకు సెల్‌ఫోన్‌ తీసుకెళ్లడాన్ని నిలిపివేశారు. ఎంత ఆశచూపినా ఉద్యోగుల నుంచి సానుకూల స్పందన వారికి లభించలేదు. ఒంగోలులో కొందరు ఉద్యోగులు అయితే టీడీపీ కూటమి నాయకులకు చందాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు. మార్కాపురంలో ఆర్టీసీ లో పనిచేసే 40మంది ఉద్యోగులు ఓటు వేసి నేరుగా టీడీపీ అభ్యర్థి నారాయ ణరెడ్డి వద్దకు వచ్చి తమ మద్దతు తెలిపి వెళ్లారు. కనిగిరిలో టీచర్లు అంతా ఐక్యంగా తీర్మానం చేసుకొని టీడీపీ కూటమి అభ్యర్థి ఉగ్రకు అనుకూలంగా వ్యవహరించారు. అక్కడ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఇరుపార్టీల వారు డబ్బులు పంపిణీ చేశారు. దర్శిలో వైసీపీ అభ్యర్థి ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇచ్చారు. ఒంగోలులో ఉద్యోగులకు రూ.5వేల నుంచి రూ.10వేలు ఇస్తే మా కెంత ఇస్తారంటూ సాధారణ ఓటర్ల నుంచి డిమాండ్‌ పెరిగింది. దీంతో గత్యం తరం లేక వైసీపీకి ఆధిక్యత ఉన్న ఒక సామాజికవర్గం నివసించే ప్రాంతంలో రూ.5వేల ప్రకారం వైసీపీ శ్రేణులు ఆదివారం రాత్రే డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. మరో ప్రాంతంలో రూ.3వేలు ఇవ్వబోగా వారు రూ.5వేలు కావా లంటూ డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. ఇక వైసీపీ అధినాయకత్వం సోమ, మంగళవారాల్లో ఓట్లకు డబ్బులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం.

చెవిరెడ్డి ఝలక్‌

ఒంగోలు లోక్‌సభ పరిధిలో చెవిరెడ్డి చేయూతతో మరిన్ని డబ్బులు ఇస్తా మని చెప్పిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు చేదు అనుభవాలు ఎదురైనట్లు సమాచారం. ఒకసారి మండలస్థాయిలో పరిచయ కార్యక్రమంలో కనిపించిన చెవిరెడ్డి ఆ తర్వాత జగన్‌ సభల్లో మాత్రమే ప్రత్యక్షమయ్యారు. పార్టీ ఇచ్చే ఫండ్‌కు తోడు చెవిరెడ్డి ఇచ్చే చేయూతతో పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయాలనుకున్న వైసీపీ నాయకులు కనీసం చెవిరెడ్డి అందు బాటులో కూడా లేక కస్సుబుస్సులాడుతున్నట్లు తెలిసింది. ఒకరిద్దరు అభ్యర్థు లకు అ‘ధనం’గా కొంత సమకూర్చిన చెవిరెడ్డి మిగిలిన వారిని గాలికొదిలేశా రనే ప్రచారం జరుగుతోంది. పార్టీ పంపిన ఫండే నా ఫండ్‌ అంటూ ఆయన సమాధానం ఇవ్వడంతో వైసీపీ అభ్యర్థులు ముందుగా చెప్పిన స్థాయిలోఓట్లకు డబ్బులు ఇవ్వలేక అభాసుపాలవుతున్నారు.

Updated Date - May 07 , 2024 | 08:06 AM