Share News

నీటి సమస్యపై సమరం

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:47 PM

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

నీటి సమస్యపై సమరం
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణుల ధర్నా

నిధులు లేవు.. ట్యాంకర్లు తిప్పలేం : మునిసిపల్‌ కమిషనర్‌

కనిగిరి, మార్చి 4 : ప్రజలకు తాగునీటిని సరఫరా చేయలేని అసమర్థతలో మున్సిపాల్టీ పాలకులు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి విమర్శించారు. సుమారు 10 రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నా పాలకులకు పట్టకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రే ణులతో కలసి ఉగ్ర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు నీటిని సక్రమం గా అందించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్ర జా సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. వారం రోజులుగా నీటి ని సరఫరా చేయకుం డా ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని కమిషనర్‌ రంగారావును ప్రశ్నించారు. ఈ సమయంలో కమిషనర్‌ మున్సిపాల్టీకి నిధులు లేవని, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయలేమని చెప్పా రు. అవసరమైన వారికి నీటిని ఇస్తామని, కానీ వారు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో ఉగ్రతో పాటు టీడీపీ శ్రేణులు అవాక్కయ్యారు. సంపులకు ట్యాంకర్లతో నీటిని ఎక్కించే పరిస్థితి లేదని కమిషనర్‌ తెగేసి చెప్పారు. దీంతో ఉగ్ర కనీసం పేదల కాలనీలకైనా నీటిని సరఫరా చేయాలని కోరడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఈ సమయంలో స్పందించాల్సిన పాలక పక్ష సభ్యులు పత్తా లేకుండా పోయారు. దీంతో టీడీపీ శ్రేణులు మున్సిపాల్టీ అసమర్థ పాలనపై నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతపట్టి కార్యాలయం ఎదుట బైఠాయించారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ నీటి సమస్యను ఉన్నతాధికారులకు తెలియచేసి సాధ్యమైనంత వరకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్‌ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి), తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, ఫిరోజ్‌, రోషన్‌ సందాని, గండికోట రమేష్‌, నజిముద్దీన్‌, చిలకపాటి లక్ష్మయ్య, తెలుగుమహిళలు కరణం అరుణ, మాజీ కౌన్సిలర్లు షేక్‌ వాజిదాబేగం, శ్రీలత, తులసి, దొరసాని, స్వప్న, నీరజ, అమ్ములమ్మ, ఽవెంకటలక్షమ్మ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:47 PM