Share News

నామినేషన్‌లకు పటిష్ట భద్రత

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:35 PM

సార్వత్రిక ఎన్నికల నామినేషన్‌ల పర్వం గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి ఆదేశించారు. స్థానిక డీపీవోలో ఆయన బుధవారం ఎస్పీ సుమిత్‌సునీల్‌తో కలిసి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ

నామినేషన్‌లకు పటిష్ట భద్రత
సమావేశంలో మాట్లాడుతున్న ఐజీ త్రిపాఠి,హాజరైన పోలీస్‌ అధికారులు

నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

పోలీసు అధికారులకు గుంటూరు రేంజ్‌ ఐజీ త్రిపాఠి ఆదేశం

ఒంగోలు (క్రైం), ఏప్రిల్‌ 17 : సార్వత్రిక ఎన్నికల నామినేషన్‌ల పర్వం గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి ఆదేశించారు. స్థానిక డీపీవోలో ఆయన బుధవారం ఎస్పీ సుమిత్‌సునీల్‌తో కలిసి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 25వరకు నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగి, ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండి మద్యం, నగదు, ప్రజలను ప్రలోభాలకు గురిచేసే వస్తువుల సరఫరాకు అడ్డుకట్టవేయాలన్నారు. ఎక్కడికక్కడ నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా రాజకీయ పార్టీల ముఖ్యనాయకుల పర్యటనలలో పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు స్టేషన్‌ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈసందర్భంగా జిల్లాలోని పోలింగ్‌ స్టేషన్‌లు, చెక్‌పోస్టుల వివరాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్యారా ఎస్పీ వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.నాగేశ్వరావు, ఎస్‌.వి.శ్రీధర్‌రావు, అశోక్‌బాబు, డీఎస్పీలు కిషోర్‌బాబు, రామరాజు, అశోక్‌వర్ధన్‌, సిహెచ్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:35 PM