Share News

విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:46 PM

మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా సా గుతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారం మూడు పు వ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. కొన్ని గ్రామాల్లో వేలంపాటలు నిర్వహించి ఎక్కువ పాట పాడినవారు దుకాణాలను నిర్వహిస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో అవకాశాన్ని బట్టి దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించే బెల్టు దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌కు రూ.10 అ దనంగా చెల్లించి గ్రామాలకు తరలించి దుకాణాలను నిర్వహిస్తున్నారు.

విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు
త్రిపురాంతకంలోని ప్రభుత్వ మద్యం దుకాణం

సందుకో దుకాణం

కొన్ని గ్రామాల్లో పాటలు

త్రిపురాంతకంలో అన్ని కిచిడీ హోటళ్లు,

పట్టణంలో మొబైల్‌ బెల్టు దుకాణాలు

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రూ. 10కి అదనంగా కొనుగోలు

చోద్యం చూస్తున్న అధికారులు

త్రిపురాంతకం, ఫిబ్రవరి 20 : మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా సా గుతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారం మూడు పు వ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. కొన్ని గ్రామాల్లో వేలంపాటలు నిర్వహించి ఎక్కువ పాట పాడినవారు దుకాణాలను నిర్వహిస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో అవకాశాన్ని బట్టి దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించే బెల్టు దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌కు రూ.10 అ దనంగా చెల్లించి గ్రామాలకు తరలించి దుకాణాలను నిర్వహిస్తున్నారు. అక్కడ క్వార్టర్‌ బాటిల్‌కు సమయా న్ని బట్టి రూ.50 నుంచి 70 వరకు అదనంగా తీసుకు ని విక్రయిస్తున్నారు. దీనికితోడు మద్యం దుకాణాల్లో పని చేస్తున్న సిబ్బందే మద్యం బాటిళ్లను గ్రామాలకు చేరుస్తూ బాటిల్‌కు రూ.10 నుంచి 20 వరకూ అద నంగా వసూలు చేసుకుంటున్నారు. నిబంధన మేరకు ఒక్కో వ్యక్తికి మూడు క్వార్టర్‌ బాటిళ్ల కన్నా ఎక్కువ విక్రయించకూడదు. కాగా అదనంగా ధరలు వసూలు చేసి ఎన్ని కావాలంటే అన్ని విక్రయిస్తున్నారు. ఈనేప థ్యంలో ఇటీవలే త్రిపురాంతకంలోని ఓదుకాణం నుంచి 200 బాటిళ్లను తరలిస్తుండగా ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేసి నలుగురిని అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బందే. గతంలో బెల్టు దుకాణానికి మద్యం తీసుకెళుతున్న ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్రగాయాలతో చికిత్స పొం దుతూ వారం రోజుల తర్వాత మృతి చెందిన సంఘటన కూడా జరిగింది. కాగా మిగిలిన దుకాణాల్లో సిబ్బంది కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వ స్తున్నాయి. దీనికితోడు మండల కేంద్రంలో మొబైల్‌ బెల్టు దుకాణాలు పెరిగిపోయాయి. మద్యం కావాల్సినవారు బెల్టు దుకాణాల నిర్వాహకులకు ఫోన్‌ చేస్తే చాలు అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా తెల్లవారుజామున 4, 5 గంటలకు కూడా వారు ఎక్కడ ఉన్నా ఒకటో, రెండో క్వాటర్‌ బాటిళ్లతోపాటుగా అం దులోకి అవసరమైన నీళ్లు, శీతలపానీయాలు కూడా సరఫరా చేస్తున్నారు. కాగా దుకాణాల్లో కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించకూడదనే నిబంధన ఉన్నా మండల కేంద్రంలో మాత్రం దాదాపు అన్ని కిచిడీ హోటళ్లలోనూ, ప్రధాన రహదారి పక్కనే ఉన్న పొలాలలో మద్యం సేవిస్తున్నారు. పోలీసులు రోడ్ల వెంట మద్యం సేవించే వారిని అదుపు చేస్తున్నారే తప్ప కిచిడీ హోటళ్లలో మద్యం సేవించే వారిపై దృష్టి సారించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక పోలీసులతోపాటు ఎస్‌ఈబీ అధికారులు దృష్టి సారించి బెల్లు దుకాణాల ను కట్టడి చేయాలని, హోటళ్ళలో మద్యం సేవించే వా రితోపాటు, అలా నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:46 PM