Share News

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:05 PM

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. హనుమంతునిపాడు మండలం చినగొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఇంటింటి ప్ర చా రం చేపట్టారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర ప్రతి ఇంటిని సందర్శిస్తూ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి
హెచ్‌ఎంపాడు మండలం చినగొల్లపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న డాక్టర్‌ ఉగ్ర

కూటమి అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి

హెచ్‌ఎంపాడు మండలంలో ఇంటింటి ప్రచారం

కనిగిరి, ఏప్రిల్‌ 19: వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. హనుమంతునిపాడు మండలం చినగొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఇంటింటి ప్ర చా రం చేపట్టారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర ప్రతి ఇంటిని సందర్శిస్తూ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి ఎద్డటితో పాటు రోడ్లు బాగాలేకపోవటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని గ్రామస్థు లు డాక్టర్‌ ఉగ్ర దృష్టికి తీసుకువచ్చారు. ప క్కా ప్రణాళిక ద్వారా గెలిచిన అనతి కాలం లోనే నీటి సమస్యను పరిష్కరించటంతో పా టు రోడ్లను వేయించి రవాణా ఇబ్బందులను తొలగిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. సూపర్‌సిక్స్‌ పథకాల ద్వారా చంద్రబాబు ప్ర జలకు మెరుగైన పాలన అందించనున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో నిత్యావసర ధరలతో పాటు గ్యాస్‌, ఆయి ల్‌ రేట్లు విపరీతంగా పెంచి ప్రజలకు నరకం చూపిం చా రని ఉగ్ర విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో వై సీపీ నేతలు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ వస్తున్నారని అన్నారు. ప్రజలకు ఏమి అభివృద్ధి చేశారో వైసీపీ నేతలను నిలదీయాలన్నారు. కా ర్యక్రమంలో టీడీపీ హనుమంతునిపాడు మండల అ ధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్‌టీఆర్‌), గాయం తిరుపతిరెడ్డి, గాయం రామిరెడ్డి, మురహరి నరసయ్య, చీ కటి వెంకటసుబ్బయ్య, తాతపూడి స్టాలిన్‌(బుజ్జి), తది తరులు పాల్గొన్నారు.

సమష్టిగా పనిచేద్దాం.. విజయం మనదే!

వెలిగండ్ల, ఏప్రిల్‌ 19: కనిగిరి నియోజకవర్గంలో నా యకులు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి, టీడీపీ జెండా ఎగరేయాలని కూటమి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని మరపగుంట్ల పంచాయతీకి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి శు క్రవారం ఉగ్ర ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ళగా నాతోపాటు నా యకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. వా రిని ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు. కొత్తాపాత తేడా లే కుండా మనమంతా టీడీపీ కుటుంబసభ్యులమేనని అ న్నారు. మరో 25 రోజులు కష్టపడండి.. కచ్చితంగా అధికా రాన్ని చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కార్య క్రమంలో శ్వామల కాశీరెడ్డి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, కేలం ఇంద్రభూపాల్‌ రెడ్డి, చిలకల వెంకటేశ్వర్లు, ఒంగోలు శ్రీను, కొండు భాస్కర్‌ రెడ్డి, కర్నా టి భాస్కర్‌రెడ్డి, మీనిగ కాశయ్య, తదితరులు పాల్గొన్నారు.

మాచవరంలో ఇంటింటి ప్రచారం

కనిగిరి, ఏప్రిల్‌ 19: కనిగిరి ప్రాంత ప్రజల భవిష్యత్తు తరాలకు భరోసా ఉగ్రతోనే సాధ్యమని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి తమ్మినేని వెంకట రెడ్డి అన్నారు. మండలంలోని మాచవరం గ్రామంలో శుక్రవారం రాత్రి భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్‌సిక్స్‌ పథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో నెల కొన్న మంచినీటి, తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం జరగాలంటే ఉగ్ర లాంటి సమర్థుడైన నాయకుడిని గెలి పించుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షు డు సూరసాని హజరత్‌రెడ్డి, కార్యదర్శి కుడుముల షడ్రక్‌, రామయ్య, ఒంటిపెంట శ్రీనివాసులురెడ్డి, చీమలదిన్నె చినవెంకటసుబ్బయ్య, ముప్పారపు మార్కు, తదితరులు పాల్గొన్నారు.

తండ్రి కోసం తనయుడు..

పీసీపల్లి, ఏప్రిల్‌ 19: కూటమి అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి తనయుడు జయసింహారెడ్డి శుక్రవారం పీసీపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మురుగుమ్మి, జంగాలపల్లి గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను పలకరిస్తూ సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డికి, ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెం ట్‌ ఉపాధ్యక్షుడు గడ్డం బాలసుబ్బయ్య, వెంగళాయపల్లి సర్పంచ్‌ కరణం తిరుపతయ్య, వడ్డెంపూడి వెంకట్‌ (చిన్నా), బీసీ సెల్‌ కార్యదర్శి కోమటిగుంట్ల వీరయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

కాగా, పెదఅలవలపాడు, పీసీపల్లి క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు పువ్వాడి నాగరాజు, వీరపనేని పెద్దన్న ఆధ్వర్యంలో మా రెళ్ల, గోపవరపువారిపల్లి, బుడ్డారెడ్డిపల్లి గ్రామాల్లో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:05 PM