తైక్వాండోలో సెయింట్ ఆన్స్ విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:59 AM
సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తైక్వాండో పోటీలలో ప్రతిభ కనబరిచారు. ఆరు స్వర్ణ, ఒక వెండి పతకాలను సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు విజేతలను అభినందించారు.

ఆరు స్వర్ణాలు, ఒక వెండి పతకం
చీరాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తైక్వాండో పోటీలలో ప్రతిభ కనబరిచారు. ఆరు స్వర్ణ, ఒక వెండి పతకాలను సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన జేఎన్‌టీయు (కె) పరిధిలో అంతర్ కళాశాలల తైక్వాండో పోటీలు, సెలక్షన్ ట్రైల్స్ సెయింట్ ఆన్స్‌లో జరిగాయన్నారు. వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి మొత్తం 50 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. వారిలో తమ కళాశాలకు చెందిన ఆరుగురు స్వర్ణ పతకాలు, ఒక వెండి పతకం సాధించారని వివరించారు. కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ 53 కిలోల విభాగంలో పి.శ్రీలేఖ, బంగారు పతకం (సెయింట్ ఆన్స్), 46 కేజీల విభాగంలో శ్యామలి, (రైస్ కళాశాల), 49 కేజీల విభాగంలో కె.దేవకి (చైతన్య కాలేజీ), 57 కేజీల విభాగంలో పి.బాలురేఖ (సెయింట్ ఆన్స్), 74 కేజీల విభాగంలో వి.వినీత (సెయింట్‌ఆన్స్) వి.పవిత్ర, బంగారు పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో 54 కేజీల విభాగంలో వి.మణిదీప్ (సెయింట్ ఆన్స్), 58 కేజీల విభాగంలో షాహిద్ (సెయింట్ ఆన్స్), 63 కేజీల విభాగంలో పి.నాగశ్రీహరి, 67 కేజీల విభాగంలో యజ్ఞ, 74 కేజీల విభాగంలో ఎస్. శంకరరావు (జేఎన్‌టీయుకే), 80 కేజీల విభాగంలో చరణ్ (లెనోవా కాలేజీ), 87 కేజీల విభాగంలో షేక్ షాహిద్ (సెయింట్ ఆన్స్) బంగారు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రతినిధులు, సహా విద్యార్థులు అభినందించారు. కార్యక్రమంలో వివిధ విభాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.