టీడీపీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన
ABN , Publish Date - Oct 28 , 2024 | 12:40 AM
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పొదిలిలో విశేష స్పందన లభించింది. పట్టణలోని 1, 2, 3 వార్డులో శనివారం మండలాధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పొదిలి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పొదిలిలో విశేష స్పందన లభించింది. పట్టణలోని 1, 2, 3 వార్డులో శనివారం మండలాధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి లక్ష్యమన్నారు. అందుకు ఎనలేని కృషి చేస్తున్నా రన్నారు. వంద రూపాయలు చెల్లించిన సభ్యత్వం తీసుకోవాలన్నారు. సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాదబీమా వర్తిసుందన్నారు. కార్యక్రమంలో, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, పట్టణాధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్ జిల్లా ముస్లింమైనారిటీ నాయకులు రసూల్, మాజీ సర్పంచ్ కాటూరి చినబాబు, రైతుసంఘ నాయ కులు ఆవులూరి యలమంద, గౌస్. షబ్బీర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కంభం : కంభం, కందులాపురం, అర్బన్‌కాలనీలో ఆదివారం రెండవరోజు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని టీడీపీ మైనారిటీ విభాగం మండల నాయకులు జేడీ.బాబు, షేక్ అక్తర్‌హుస్సేన్, ఎన్‌ఆర్‌ఐ సయ్యద్ రఫీ తెలిపారు. ఆదివారం కంభం అర్బన్‌కాలనీలో 100కు పైగా టీడీపీ సభ్యత్వాలు చేశారు. టీడీపీ బీమా సభ్యత్వ నమోదు కార్యకర్తల జీవితానికి భరోసా అని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నేత సయ్యద్ నూరుల్లాఖాద్రి, జిల్లా మైనారిటీ కార్యదర్శి సయ్యద్ అనీస్ అహమ్మద్, షేక్ దీనావలి, పెద్దపిచ్చయ్య, దూదేకుల కాశయ్య, రజాక్ బాషా, అస్లామ్‌బేగ్ పాల్గొన్నారు.