జిల్లా సమస్యలపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:51 AM
జిల్లాలో ప్రధానమైన వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడంతోపాటు, సాగర్‌కాలువల పొడిగింపు, రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చే స్తానని రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.

వెలిగొండ పూర్తికి, సాగర్‌కాలువల పొడిగింపునకు కృషి
పౌరసన్మాన సభలో మంత్రి స్వామి
పాల్గొన్న పలువురు నేతలు
నష్టపోయిన కార్యకర్తల బిల్లులు చెల్లిస్తాం
జిల్లాలో జరిగిన అవినీతిపై విచారణ
బాధ్యులపై చర్యలు
టంగుటూరు/కొండపి/సింగరాయకొండ, జూన్ 16 : జిల్లాలో ప్రధానమైన వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడంతోపాటు, సాగర్‌కాలువల పొడిగింపు, రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చే స్తానని రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. టంగుటూరు మండలంలోని సొంతగ్రామమైన తూర్పునాయుడుపాలెంలో ఆదివారం రాత్రి జరిగిన పౌరసన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ట్రిపుల్‌ఐటీ, నిమ్జ్ పూర్తికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ జరిగిందని, దీనిపై విచారణ చేయిస్తామని చె ప్పారు. ప్రభుత్వాన్ని అవినీతి రహితంగా చంద్రబాబు సా రథ్యంలో నడుపుతామన్నారు. జిల్లాలో వైసీపీ నాయకులు లెక్కలేనితనంగా చేసిన అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు. గ్రామవలంటీర్లు అందరూ తమ పార్టీవారే అని వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి చెబుతుంటే, ఇప్పు డు వలంటీర్లు తమ పోస్టులకు బలవంతంగా వైసీపీ నా యకులు రాజీనామా చేయించారంటూ తమకు మెసేజ్ లు పెడుతున్నారన్నారు. అదేవిధంగా గత టీడీపీ ప్రభు త్వ హయాంలో అభివృద్ధి పనులు చేసి నష్టపోయిన కార్యకర్తల బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. తనను ఆదరించిన కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంతోపాటు, మూసి, పాలేరులపై చెక్‌డ్యాంలు నిర్మిస్తామన్నారు. రెండు నెలలకోసారి జిల్లాశాసనసభ్యులు, అ ధికారులతో సమావేశాలు నిర్వహించి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి తనకు మంత్రి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తనకు మంత్రి పదవి రావడానికి సహకరించిన జిల్లాలోని ప్రతి శాసనసభ్యుడికి, పార్టీ ఇన్‌చార్జిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దామచర్ల కుటుంబం అండదండలతో తనకు మంత్రి పదవి రావడం ఆనందదాయకమన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నిబద్ధతతో స్వామి పనిచేస్తున్నారని, అందువల్లనే మంత్రి పదవి దక్కిందని చెప్పారు.
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తమ కుటుంబంతో అనుబంధం ఉన్న స్వామికి మంత్రి ప దవి రావడం సంతోషకరమన్నారు. ప్రజలు టీడీపీకి అ ఖండ మెజార్టీ కట్టబెట్టారని, వారికి ఆకాంక్షలకు అనుగుణంగా తమపై బాధ్యతలు కూడా పెరిగాయని చెప్పారు. శాసనసభ్యులు, ఇన్‌చార్జిలు సమన్వయంతో సాగి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బీఎన్.విజయ్‌కుమార్, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎం.ఎం.కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు, నారాయణరెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, దర్శి, ఎర్రగొండపాలెం టీ డీపీ ఇన్‌చార్జిలు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలా జీ, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్, బీజేపీ జిల్లా నాయకుడు యోగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గుండపనేని అచ్యుత్‌కుమార్, నారపశెట్టి పాపారావు పాల్గొన్నారు. అనంతరం స్వామి, సత్యలను సన్మానించారు.