గొట్టిపాటికి అమరావతి రైతుల సంఘీభావం
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:01 AM
టీడీపీ కూటమి ఆభ్యర్థి గొట్టిపాటి నామినేషన్ సందర్భంగా శుక్రవారం అమరావతి నుంచి పలువురు రైతులు వచ్చి రవికుమార్‌కు తమ సంఘీభావాన్ని తెలిపారు.
అద్దంకిటౌన్, ఏప్రిల్ 19 : టీడీపీ కూటమి ఆభ్యర్థి గొట్టిపాటి నామినేషన్ సందర్భంగా శుక్రవారం అమరావతి నుంచి పలువురు రైతులు వచ్చి రవికుమార్‌కు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయస్థానం టూ దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో మా వెన్నంటి ఉండి, నియోజవర్గంలో మాకు అవసరమైన భోజనవసతి, బస వంటి అనేక విషయాలల్లో మాకు గొట్టిపాటి ఎంతో సహకరించారని తెలిపారు. వైసీపీ అరాచకాలను తట్టుకుని పార్టీ కోసం నిలబడిన గొట్టిపాటికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అమరావతి రైతులతో పాటు మహిళలు ఉన్నారు.