Share News

అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించండి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:06 AM

రాష్ట్రంలో ఐదేళ్లు అరాచక పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మూడు పార్టీలు ఎన్నికల్లో జత కలిశాయని చెప్పారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో గ్రామాల్లో వైసీపీ కనీసం తట్టెడు మట్టె కూడా వేయలేదన్నారు.

అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించండి
మాట్లాడుతున్న దామచర్ల సత్య

పలు గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు

45 రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలని పిలుపు

సింగరాయకొండ, మార్చి 28 : రాష్ట్రంలో ఐదేళ్లు అరాచక పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మూడు పార్టీలు ఎన్నికల్లో జత కలిశాయని చెప్పారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో గ్రామాల్లో వైసీపీ కనీసం తట్టెడు మట్టె కూడా వేయలేదన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, దాడులకు తెగబడటం, అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురిచేయడం తప్ప అభివృద్ధిపై వైసీపీ నాయకులు దృష్టి పెట్టలేదని విమర్శించారు.

పాకలలో..

పాకల పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం, పాత ఊరు, చెల్లమ్మగారిపాలెం, పోతయ్యగారిపాలెం, క్రాంతినగర్‌ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సత్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషిచేసిన ఏకైక పార్టీ టీడీపీనేనని చెప్పారు. తన తాత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు హయాంలో బకింగ్‌హామ్‌ కాలువపై బ్రిడ్జినిర్మాణం, మత్స్యకార గ్రామాల్లో విద్యుత్‌ వసతి, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం, పేదలకు ఇళ్లు కేటాయించారని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణంతోపాటు పాకల బీచ్‌లో టూరిజం అభివృద్ధి చేయటానికి రూ.4కోట్లతో టూరిజం రెస్టారెంట్‌ పనులను ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అర్ధంతరంగా నిలిపివేసిందని దుయ్యబట్టారు. పాకల గ్రామంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్‌, వైసీపీ ప్రభుత్వాలు చేసింది శూన్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో స్థానికుడైన ఎమ్మెల్యే స్వామిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు అడకా స్వాములు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మనోజ్‌కుమార్‌ టీడీపీ, జనసేన మండల అధ్యక్షులు వేల్పుల సింగయ్య, రాజేష్‌ సర్పంచ్‌ సైకం చంద్రశేఖర్‌, నేతలు చీమకుర్తి కృష్ణ, షేక్‌ సంధానీబాషా, సన్నెబోయిన శ్రీనివాసులు కూనపరెడ్డి సుబ్బారావు, గాంధీచౌదరి, రాయపాటి సీతమ్మ, చంటి, గాలి హరిబాబు, మించల బ్రహ్మయ్య, రాజగోపాల్‌రెడ్డి, రేణుమాల పోతురాజు, కోటేశ్వరరావు, శంకర్‌ పాల్గొన్నారు.

ఊళ్లపాలెంలో..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఊళ్లపాలెంలో మత్స్యకార బాలికల కోసం గురుకుల పాఠశాలను తీసుకొచ్చామని సత్య గుర్తు చేశారు. పాఠశాల నిర్మాణానికి భూమిని కేటాయిస్తే వైసీపీ వచ్చాక ఆభూమిలో జగనన్న లేఅవుట్‌ వేయటం దుర్మార్గమన్నారు. మత్స్యకారులకు చేపలు ఎండబెట్టుకోవటానికి ప్లాట్‌ప్లామ్‌ నిర్మాణంతోపాటు మట్టిరోడ్లను సీసీ రోడ్లగా మార్చమని చెప్పారు. గ్రామంలో మిగిలిపోయిన అభివృద్ధిని పూర్తిచేయాలంటే కూటమి అభ్యర్థి స్వామికి ఓటువేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాయిరెడ్డి మురళి, కానాల బాలాజీ, కష్ణచైతన్య, నాయుడు జనార్దన్‌, కొక్కిలగడ్డ శ్రీనివాసులు పాల్గొన్నారు.

బింగినపల్లిలో..

బింగినపల్లిలో సత్య మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో గ్రామంలోని అన్ని మట్టిరోడ్లను సీసీరోడ్లగా మార్చామని చెప్పారు. నాలుగు శ్మశానవాటికలను నిర్మాణం చేశామన్నారు. ఎస్సీ కాలనీలో వాటర్‌ట్యాంక్‌ నిర్మాణం చేశామని గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామంలో పార్టీకి మెజారిటీని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పులి ప్రసాద్‌, మాలకొండయ్య, సన్నెబోయిన మాలకొంయ్య, రోశిరెడ్డి, నూకసాని నరసింహ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, పెద్దన్నబోయినవారిపాలేనికి చెందిన వైసీపీకి చెందిన 30 కుటుంబాలు సత్య సమక్షంలో టీడీపీలో చేరారు.

మూలగుంటపాడులో..

మాలగుంటపాడులో సత్య మాట్లాడుతూ రామతీర్థం నీటిని గ్రామానికి తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అంతర్గత డ్రైనేజీతో కూడిన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. రూ.1.55 కోట్లు వెచ్చించి నూతన జూనియర్‌ కళాశాలను నిర్మించామని చెప్పారు. అధికారంలోకి రాగానే అమలుచేసే సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిగురుపాటి గిరి, గుదే వెంకటేశ్వర్లు, సన్నెబోయిన వెంకటేశ్వర్లు, అంబటి శ్రీను, మల్లికార్జున, సన్నెబోయిన శ్రీను, చల్లా శ్రీనివాసరావు, వెంకట్రావు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:06 AM