Share News

దర్శిలో మూతపడిన దుకాణాలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 10:59 PM

ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా దర్శి పట్టణంలో దుకాణా లను అధికారులు మూసి వేయించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు పట్టణంలోని అన్ని దుఖాణాలను సోమవారం మధ్యా హ్నం మూసి వేయించారు. ఈసందర్భంగా సీఐ షేక్‌ షమీముల్లా మాట్లా డుతూ ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో, ఫలితాల అనంతరం ప్రజలు ఉద్రిక్త తకు గురికాకుండా ప్రశాతంగా ఉండాలని కోరారు.

దర్శిలో మూతపడిన దుకాణాలు
దర్శిలో దుకాణాల మూసివేత

దర్శి, జూన్‌ 3: ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా దర్శి పట్టణంలో దుకాణా లను అధికారులు మూసి వేయించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు పట్టణంలోని అన్ని దుఖాణాలను సోమవారం మధ్యా హ్నం మూసి వేయించారు. ఈసందర్భంగా సీఐ షేక్‌ షమీముల్లా మాట్లా డుతూ ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో, ఫలితాల అనంతరం ప్రజలు ఉద్రిక్త తకు గురికాకుండా ప్రశాతంగా ఉండాలని కోరారు. ఎవరైనా గొడవలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో దుకాణాలను మూసివేయించినట్లు తెలి పారు. కౌంటింగ్‌ సందర్భంగా 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు.

కురిచేడులో పోలీసుల కవాతు

కురిచేడు, జూన్‌ 3: కురిచేడు మండలంలో సోమవారం ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఆ ధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. మంగళవారం సార్వత్రిక ఎన్నిక ల లెక్కింపు జరుగనున్న దృష్ట్యా గ్రామాలలో ఎటువంటి సంఘటనలో చోటు చేసుకోకుండా ముందుస్తు చర్యలు చేపట్టారు. కురిచేడు, నమశ్శివాయపురం, దేకనకొండ గ్రామాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్‌ అమలు లో ఉందని, గ్రామాలలో ఇద్దరి కంటె ఎక్కువ మంది గుమికూడ వద్దని ఎస్‌ఐ శ్రీకాంత్‌ సూచించారు. ఫలితాల అనంతరం ర్యాలీలు నిర్వహించరాదన్నారు.

పామూరులో మూడు రోజులపాటు 144వ సెక్షన్‌ అమలు

పామూరు, జూన్‌ 3: కౌంటింగ్‌ సందర్భంగా ఎస్పీ ఆదేశాలమేరకు మంగళ వారం నుంచి మూడు రోజులపాటు పామూరు మండలంలో 144వ సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్‌ఐ ఎం.సైదుబాబు తెలిపారు. సభ లు, ర్యాలీలు, బాణ సంచా కాల్చడం, తదితర కార్యాక్రమాలకు ఎవరూ పాల్పడ వద్దన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు సోదర భావంతో సంయమనం పాటించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరారు.

ముండ్లమూరులో.. ముండ్లమూరు, జూన్‌ 3: కౌంటింగ్‌ సందర్భంగా మంగళ వారం గ్రామంలో 144వ సెక్షన్‌ అమల్లో ఉంటున్నట్టు ఎస్‌ఐ వి.ఆంజనేయులు తెలిపారు. ప్రజలు గుమికూడటం, బాణసంచా కాల్చటం చేయరాదన్నారు. ఒకరిద్దరు తప్పా ఎక్కువమంది తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో ప్రశాంతతకు ప్రజలు సహకరించాలన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 10:59 PM