Share News

మార్టూరులో వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Apr 04 , 2024 | 11:17 PM

మార్టూరులో వైసీపీకి షాక్‌ తగిలింది. బలపాం కాలనీకి చెందిన కాపు నేతలు, 30 కాపు కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారంతా గురువారం మార్టూరు నుంచి ద్విచక్రవాహనాలపై ర్యాలీగా వెళ్లి మండలంలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో తెలుగుదేశం బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు సమక్షంలో పార్టీలో చేరారు.

మార్టూరులో వైసీపీకి షాక్‌
ఏలూరి సమక్షంలో పార్టీలో చేరిన మార్టూరు కాపు నేతలు

ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన కాపు నేతలు

నమ్మకం నిలబెట్టుకుంటా.. అందరికీ అండగా ఉంటా

మార్టూరు, ఏప్రిల్‌ 4 : మార్టూరులో వైసీపీకి షాక్‌ తగిలింది. బలపాం కాలనీకి చెందిన కాపు నేతలు, 30 కాపు కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారంతా గురువారం మార్టూరు నుంచి ద్విచక్రవాహనాలపై ర్యాలీగా వెళ్లి మండలంలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో తెలుగుదేశం బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ ఏలూరి కండువాలు వేసి ఆహ్వానించారు. గతంలో కొంతమంది కాపు నేతలు తెలుగుదేశంలోనే ఉన్నప్పటికీ ప్రస్తుతం చేరిన కాపు నాయకులతో దాదాపుగా 90శాతం కాపు కుటుంబాలు టీడీపీ కూటమిలో చేరినట్లయింది. మార్టూరులో సుమారు 250 కాపు కుటుంబాలు ఉన్నాయి. వారంతా గతంలో 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎ న్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఉన్నారు. అయితే ఏడాది క్రితం ప ర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆ మంచి రాకతో కాపు నేతలు ఆయన వెంట వెళ్లారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో ఆమంచి పర్చూరు సమన్వయ కర్తగా వైదొలగి చీరాలకు వెళ్లిపోవడంతో కాపు నాయకులు టీడీపీలోకి వచ్చేందుకు మొగ్గు చూపారు. గురువారం వారంతా భారీగా తరలి వచ్చి ఏలూరి సమక్షంలో సైకిలెక్కారు. పార్టీలో చేరినవారిలో సకల ఆంజనేయులు, పెంట్యాల బుల్లయ్య, పూజల నాగు, పెంట్యాల సుబ్బరామయ్య, ముప్పవరపు హనుమంతరావు, గోపిశెట్టి కోటయ్య, తిరుమల శెట్టి వీరాంజనేయులు, పెంట్యాల భద్ర య్య, కాసా నాగార్జున, పూజల పవన్‌, ముప్పవరపు నాగేశ్వరరావు, ఓబుల శెట్టి సుబ్బారావు, గజ్జల శివ, గజ్జల సాంబ, కందుకూరి చంద్రశేఖర్‌, కందుకూరి శివన్నారాయణ, సంజయ్‌, భార్గవ్‌, కాకుమాను కిరణ్‌, గుత్తి నాగరాజు తదితర కుటుంబాలు పార్టీలో చేరారు.

అండగా ఉంటా : ఎమ్మెల్యే ఏలూరి

రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయన్నారు. మాపై నమ్మకంతో వచ్చిన మీకు అన్ని వేళలా అండగా ఉంటానని కాపు నాయ కులకు ఏలూరి మాటిచ్చారు. అందరం ఒక్కటై జగన్‌రెడ్డిని గద్దె దింపుదామ న్నారు. ప్రజల భవిష్యత్‌ కోసం చంద్రబాబు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అరాచక ప్రభుత్వంపై పోరు సాగిస్తున్నారన్నారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్‌ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలన్నారు.

బెదిరించినా ఏలూరితోనే : కాపు నేతలు

బెదిరించినా.. భయపెట్టినా మీతోనే ఉంటామని కాపు నేతలు ఎమ్మెల్యే ఏలూరికి స్పష్టం చేశారు. మీ గెలుపునకు సాయశక్తులా కృషి చేస్తామని నాయకులు ఏలూరికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఎమ్మెల్యేగా ఏలూరి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రతినబూనారు.

వైసీపీని వీడి టీడీపీలోకి

మార్టూరు మండలం నుంచి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరుతున్నారు. గురువారం ఉదయం ఎమ్మేల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఏలూరి కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మార్టూరు గ్రామ పంచాయతీ 13వ వార్డు మెంబరు వైసీపీ నాయకుడు పెనుబోయిన శ్రీనివాసరావు, బలరాంకాలనీకి చెందిన రామిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీలో చేరగా, వారిని ఏలూరిని స్వాగతించారు. అలాగే మండలంలోని కోలలపూడి గ్రామంలో వైసీపీకి చెందిన ఎస్సీలు గాలి ఏసుబాబు, గాలి పేరయ్య, కుంచెపు శ్రీనివాసరావు, తాతా రాం బాబు, గాలం కామయ్య టీడీపీలో చేరారు. కార్యక్రమంలో కామినేని జనార్దన్‌, షేక్‌ రజాక్‌, తాటి నాగేశ్వరరావు, తాటి నాగార్జున, తొండెపు ఆది నారాయణ, మిన్నెకంటి రవికుమార్‌, గొట్టిపాటి వెంకట్రావు, రావినేని శ్రీనివాసరావు, కన్నె గంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కూటమి అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా

పర్చూరు : రాష్ట్ర భవిష్యత్‌ కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కలసి కట్టుగా ముందుకు సాగుదామని పలువురు నా యకులు పిలుపు నిచ్చారు. గురువారం పర్చూరులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానిన నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, యువకులు, మహిళలు తరలిరావడంతో శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణారావు, కొల్లా శివరాంప్రసాద్‌, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, తంగెళ్ల మల్లికార్జునరావు, మామిడిపాక హరిప్రసాద్‌, గడ్డిపాటి శ్రీనివాసరావు, మల్లాధి సురేష్‌, కృష్ణంశెట్టి జగధీష్‌, కొల్లా చౌదరి, తులసి రామాంజనేయులు, ఊటుకూరి నిర్మల, శివాలశెట్టి రమాదేవి, కొల్లా సుబ్బాయమ్మ, జనసేన పార్టీ నాయకులు కారంపూడి సందీప్‌ తేజ, రంగిశెట్టి ఆంజనేయులు, మారుతి, వీరాంజనేయులు, తోట మణి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 11:17 PM