వైసీపీకి షాక్
ABN , Publish Date - Mar 25 , 2024 | 11:09 PM
ప్రకాశం జిల్లాలో అధికారపార్టీకి షాక్ తగిలింది. కం భం, అర్ధవీడు మండలాల నుంచి సుమారు 500 కుటుంబాలు వైసీపీని వీడి గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సోమవారం కంభంలో ఆ మండల జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లి జ్యోతి, ఆమె భర్త కందులాపురం మాజీ సర్పంచ్ కొత్తపల్లి శ్రీనివాసులు వైసీపీని వీడి టీడీపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు అర్ధవీడు మండల ఎంపీపీ మేడిద వెంకటరావు, తురిమెళ్ల సర్పంచ్ మాదా సుభద్ర, మాదా నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ, మాగుటూరు సర్పంచ్ కేతావత్ ఈశ్వరీబాయి, జయరామ్‌నాయక్, సాగర్, కందులాపురం ఎంపీటీసీ మాజీ సభ్యుడు కటికల భాస్కర్, కంభం మండల ఆర్యవైశ్య ప్రముఖులు బిజ్జాల కిశోర్, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వా రి అనుచరులు టీడీపీలో చేరారు.
ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు
కంభం, అర్ధవీడు మండలాల నుంచి 500 కుటుంబాలు
అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిక
చోళ్లవీడులో జగన్ పార్టీని వీడిన 100 మంది
కంభం, మార్చి 25 : ప్రకాశం జిల్లాలో అధికారపార్టీకి షాక్ తగిలింది. కం భం, అర్ధవీడు మండలాల నుంచి సుమారు 500 కుటుంబాలు వైసీపీని వీడి గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సోమవారం కంభంలో ఆ మండల జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లి జ్యోతి, ఆమె భర్త కందులాపురం మాజీ సర్పంచ్ కొత్తపల్లి శ్రీనివాసులు వైసీపీని వీడి టీడీపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు అర్ధవీడు మండల ఎంపీపీ మేడిద వెంకటరావు, తురిమెళ్ల సర్పంచ్ మాదా సుభద్ర, మాదా నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ, మాగుటూరు సర్పంచ్ కేతావత్ ఈశ్వరీబాయి, జయరామ్‌నాయక్, సాగర్, కందులాపురం ఎంపీటీసీ మాజీ సభ్యుడు కటికల భాస్కర్, కంభం మండల ఆర్యవైశ్య ప్రముఖులు బిజ్జాల కిశోర్, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వా రి అనుచరులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి , సంక్షేమం అశోక్‌రెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో అశోక్‌రెడ్డి గెలుపునకు కృషిచేస్తామన్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో కందులాపురం వార్డుమెంబర్ గజ్జా అంకయ్యగౌడ్, తడవ వెంకటేశ్వర్లు, గుర్రం శ్రీరాములు, నారాయణ, పత్తి పాండు, భీమవరపు వెంకటసుబ్బయ్య, సంకతాల నాగేశ్వరరావు, చెన్నకేశవుల సుబ్బరాయుడు, ఆవుల వెంకటేశ్వర్లు, కొ మరోలు చంద్రశేఖర్, వార్డుమెంబర్ గోపాల్, మద్దికట్ల పిచ్చయ్య, ఏలం వెంకటేశ్వరరావు, మాదా వెంకటేశ్వర్లు, యర్రంశెట్టి సుబ్బయ్య, గన్నారపు తిరుపతయ్య, జనార్దన్, రంగారెడ్డి, గోపాల్‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి బాదం మనోహర్, కొనతం సుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, స్వామిరంగారెడ్డి, చిన్నరంగారెడ్డి, జయరామిరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఆదివారం రాత్రి రాచర్ల మండలం చోళ్లవీడు గ్రామ జడ్పీటీసీ మాజీ సభ్యులు బత్తిని లలిత కుమారి, మాజీ సర్పంచ్ బత్తిని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు, విద్యా కమిటీ చైర్మన్, ముగ్గురు వార్డుమెంబర్లు, కాపు సంఘం ముఖ్య నాయకులతో సహా 100 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
కాపుల సంక్షేమం టీడీపీతోనే
- టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి
- వైసీపీనీ వీడి టీడీపీలో చేరిన రాచర్ల మండల
జడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచ్
గిద్దలూరు టౌన్, మార్చి 25 : కాపుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి రాచర్ల మండలం చోళ్లవీడు గ్రామ జడ్పీటీసీ మాజీ సభ్యులు బత్తిని లలితకుమారి, మాజీ సర్పంచ్ బత్తిని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు, విద్యా కమిటీ చైర్మన్, ముగ్గురు వార్డుమెంబర్లు, కాపు సంఘం ముఖ్య నాయకులతో సహా 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరందరికీ అశోక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ కాపులకు టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. పార్టీలో చేరిన వారిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుడిమెట్ట రంగనాయకులు, విద్యాకమిటీ చైర్మన్ గుడిమెట్ట రంగయ్య, 1, 5, 6 వార్డుమెంబర్లు చల్లా గురువయ్య, బత్తిని కృష్ణయ్య, బత్తిని అచ్చమ్మ, పేర్ల నెమలియ్య, ప్రసాద్, అబ్బిశెట్టి ప్రసాద్, శిరిగిరి నందయ్య, ముత్యాల శివ, ముత్యాల నారాయణ, బత్తిని వెంకటరమణ, గుడిమెట్ట వెంకటరంగయ్య, గుడిమెట్ట రాములు, గుడిమెట్ట పాండు టీడీపీలో చేరగా కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు కటికె యోగానంద్, టీడీపీ నాయకులు జీవనేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.