Share News

సమ్మె బాటన సెర్ప్‌ ఉద్యోగులు

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:23 PM

అంగన్‌వాడీలు, సమగ్రశిక్ష, పారిశుధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మె బాట పట్టగా ఇప్పుడు రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులు కూడా అదే బాట పట్టనున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్లు గురువారం ప్రకాశం జిల్లా సెర్ప్‌ ఉద్యోగుల జేఏసీ చైౖర్మన్‌ నరేంద్రకుమార్‌, కార్యదర్శి జి.రాంబాబు, కన్వీనర్‌ రామకృష్ణ తదితరులు కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే 22వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళనున్నట్లు లిఖితపూర్వకంగా తెలిపారు.

సమ్మె బాటన సెర్ప్‌ ఉద్యోగులు
కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న సెర్ప్‌ ఉద్యోగులు

22లోగా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళతామంటూ స్పష్టీకరణ

ఒంగోలు నగరం ,జనవరి 11: అంగన్‌వాడీలు, సమగ్రశిక్ష, పారిశుధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మె బాట పట్టగా ఇప్పుడు రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులు కూడా అదే బాట పట్టనున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్లు గురువారం ప్రకాశం జిల్లా సెర్ప్‌ ఉద్యోగుల జేఏసీ చైౖర్మన్‌ నరేంద్రకుమార్‌, కార్యదర్శి జి.రాంబాబు, కన్వీనర్‌ రామకృష్ణ తదితరులు కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే 22వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళనున్నట్లు లిఖితపూర్వకంగా తెలిపారు. 23 సంవత్సరాలుగా సెర్ప్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేలు అమలు చేసి,సర్వీసును రెగ్యులర్‌ చేయాలని, సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించి ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌ ద్వారా సెర్ప్‌, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవల్‌పమెంటు పరిధిలో మంజూరు పోస్టులుగా గుర్తిస్తూ ఇచ్చిన ఆదేశాలపై జీవోను విడుదల చేయాలని, ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్‌ సీలింగ్‌ విధానాన్ని తొలగించి మూలవేతనంపై నూరుశాతం ఈపీఎఫ్‌ అమలు చేయాలని, ఎంఎ్‌ససీసీలకు హెచ్‌ఆర్‌ పాలసి అమలు చేసి పేస్కేలు వర్తింపజేయాలని, సపోర్టింగ్‌ సిబ్బందికి, ఎల్‌1,ఎల్‌2,ఎల్‌3,ఎల్‌4తో కలిసి అన్నీ కేడర్లకు ఉద్యోగోన్నతులు , ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, సెర్ప్‌ హెచ్‌ఆర్‌ పాలసి ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తింపజేసి అర్హులందరికీ ఉద్యోగోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాలు జరపాలని, ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని తదితర డిమాండ్లను ఈ నెల 22వ తేదీలోగా పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళతామని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిప్రతంలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్‌ ఉద్యోగులు సమ్మె బాట పడితే నవరత్నాలు ఆగిపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్న నేపథ్యంలో సెర్ప్‌ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగనున్నారు. మొత్తంగా జిల్లాలో 250 మంది సెర్ప్‌ ఉద్యోగులు ఉన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:23 PM