ఉమ్మడి ప్రకాశం జిల్లాల ఖోఖో జట్ల ఎంపిక
ABN , Publish Date - Oct 23 , 2024 | 11:33 PM
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొనే ఉమ్మడి ప్రకాశం జిల్లా బాల, బాలికల ఖోఖో జట్ల ఎంపిక బుధవారం పంగులూరులో జరిగింది. ఈ ఎంపికలో జిల్లా నలు మూలల నుంచి 200 మంది బాలురు, 150 మంది బాలికలు పాల్గొన్నారు.
బాల, బాలికల వివరాలు ప్రకటించిన
రాష్ట్ర కార్యదర్శి సీతారామిరెడ్డి
పంగులూరు, అక్టోబరు 23, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొనే ఉమ్మడి ప్రకాశం జిల్లా బాల, బాలికల ఖోఖో జట్ల ఎంపిక బుధవారం పంగులూరులో జరిగింది. ఈ ఎంపికలో జిల్లా నలు మూలల నుంచి 200 మంది బాలురు, 150 మంది బాలికలు పాల్గొన్నారు. పంగులూరు ఎంఎ్‌సఆర్, అండ్ బీఎన్‌ఎం జూనియర్ కళాశాలలో అండర్ - 14 బాల, బాలికలు, అండర్-17 బాల, బాలికల ఖోఖో జిల్లా జట్లను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపిక కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భవనం కాశీవిశ్వనాథరెడ్డి, పీడీలు హనుమంతరావు, రఘుబాబు, పీఈటీలు సావిత్రమ్మ, రమాదేవి, ఖోఖో జిల్లా కోచ్ లక్ష్మీనారాయనరెడ్డి స్కూల్‌గేమ్స్ కార్యదర్శి హజీరాబేగం పాల్గొన్నారు.
ఎంపికైన ఖోఖో జట్లు
అండర్ - 14 బాలుర జట్టులో పి.వెంకటేశ్వర్లు, ఎ.శ్రీనివాస్, వి.సాగర్ (పంగులూరు), కె.విష్ణు, జి.సందీప్, కె.వెంకటసాయి, ఎస్.విశ్వనాథకుమార్, సీహెచ్ మనోహరరెడ్డి, హేమంత్‌కుమార్ (కేవీపల్లి), కె.సుమంత్, ఎస్.ఆనందబాబు (బేస్తవారపేట), లక్ష్మీనరసింహ (గుడ్లూరు), ఎం.మణికంఠ (వైదన), పి.శాంతికుమార్ (మార్టూరు), శివశంకర్ (వేటపాలెం)పూర్నచంద్రరావు (ఈదర), విశ్వనాథ్ (చీరాల), కె.ఆంజనేయులు (ఎస్‌ఎన్‌పాడు).
అండర్-14 బాలకల జట్టుకు ఎ.మేమలత, ఎ.నందిని, నీలిమ, గురవమ్మ (పాతపాడు), టి.బాల బార్గవి, ఎ.వైశాలి (ఎస్‌ఎన్‌పాడు), శ్రీలక్ష్మి (గుడ్లూరు), వి.పల్లవి, వర్షిని, అక్షయశ్రీ నాగమహిత, జి.మాధురి (కేవీపల్లి), పి.స్వాతి, ఎన్.వైష్ణవి (గణపవరం), ఎం.అణిత (ఈదర) ఎంపికయ్యారు.
అండర్-17 బాలుర జట్టుకు పి.నవీన్, డి.వినయ్, ఎం.సాగర్‌నాయక్, పి.నరేష్, సీహెచ్ నాగవర్ధన్, ఎస్‌డీ సవనాజ్, ఎం.అక్షయ్‌కుమార్ (పంగులూరు), టి.మనోజ్, ఎస్.రఝుపతి, ఎ.నవనీత్‌కుమార్, నందకిషోర్ (కేవీపల్లి), డి.అభిలాష్ (రుద్రవరం), ఎం.ఆంజనేయులు (సుంకేసుల), బి.రంగస్వామి బి.వెంకటరవీంద్ర (బి.పేట), అనిల్‌కుమార్‌నాయక్, పి.మంత్రానాయక్ (గిద్దలూరు), వి.నారాయణ (ఈదర), గోపీ కృష్నారెడ్డి(పెదారవీడు) ఎంపికయ్యారు.
అండర్ బాలికల జట్టుకు బి.కల్యాణి, కె.వైష్ణవి, ఎం.నాగేశ్వరి, ఎస్.భానుప్రియ, ఎ.నందినిరెడ్డి, ఎస్‌సవని, ఎల్.లలితేశ్వరి, జి.పావని (కేవీపల్లి), లక్ష్మీప్రసన్న, మానశ్రీ (మొగల్లూరు), డి.హేమశ్రీ (కోళ్లపూడి), ఎస్.కృష్ణసరిత, వెంకటరాజిత (గణపవరం), ఎ.పవాంగ్ (పాతపాడు), జి.రవికుమారి (ఈదర), స్నేహతిరుమల (కేజీబీవీ) ఎంపికయ్యారని రాష్ట్ర కార్యదర్శి సీతారామిరెడ్డి తెలిపారు. ఎంపికయిన క్రీడా జట్లను కళాశాల ప్రిన్సిపాల్ ఉషారెడ్డి, ఏడీపీ అధ్యక్షుడు రావూరి రమేష్ రోటరీ ప్రతినిధులు వీరరాఘవయ్య, రాయిణి సుబ్బారావు, వై.శీనయ్య, పోలినేని కోటేశ్వరరావు, దామోధరరెడ్డి, గురవమ్మ అభినందించారు.