Share News

జిల్లాలోనే ఇంటర్‌ మార్కుల స్కానింగ్‌

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:50 AM

పని వికేంద్రీకరణలో భాగంగా ఇంటర్‌ మా ర్కుల స్కానింగ్‌కు ఈఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆయా మూల్యాం కన కేంద్రాల వద్దే ఏర్పాట్లు చేశారు. వచ్చేనెల 4వతేదీతో ఇంటర్మీడియేట్‌ జ వాబుపత్రాల మూల్యాంకనం పూర్తికానుంది.

జిల్లాలోనే ఇంటర్‌ మార్కుల స్కానింగ్‌

ఏప్రిల్‌ రెండో వారంలో ఫలితాలు

ఒంగోలు (విద్య), మార్చి 28 : పని వికేంద్రీకరణలో భాగంగా ఇంటర్‌ మా ర్కుల స్కానింగ్‌కు ఈఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆయా మూల్యాం కన కేంద్రాల వద్దే ఏర్పాట్లు చేశారు. వచ్చేనెల 4వతేదీతో ఇంటర్మీడియేట్‌ జ వాబుపత్రాల మూల్యాంకనం పూర్తికానుంది. అనంతరం మూల్యాంకన కేంద్రాల్లో నే మిషన్లు ఏర్పాటు చేసి విద్యార్థుల మార్కులను స్కాన్‌ చేస్తారు. త్వరితగతిన మార్కుల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తవుతున్నందున ఏప్రిల్‌ 12 తర్వాత ఒకట్రెం డ్రోజుల్లో ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియేట్‌ బోర్డు ఏర్పాట్లు చే స్తోంది. పార్ట్‌1 వేరు చేసి ట్రంకు పెట్టల్లో భద్రపరిచి తాళం వేస్తారు. గతంలో ఓఎంఆర్‌ షీట్‌ పార్ట్‌-3 విద్యార్థుల మార్కుల వివరాలను వేరుచేసి బోర్డు కా ర్యాలయానికి పంపితే మార్కులను అక్కడ స్కాన్‌ చేసేవారు. ప్రస్తుతం ఈ విధానాన్ని మార్చి ఇక్కడే స్కాన్‌ చేస్తున్నారు. ఒంగోలులోని ఏకేవీకే జూనియర్‌ కళాశాలలోని మూల్యాంకన కేంద్రంలోనే ఈ ప్రక్రియ మొత్తం జరుగుతుంది.

Updated Date - Mar 29 , 2024 | 12:50 AM