Share News

సర్కారు వైన్స్‌ టూ బెల్ట్‌షాప్‌!

ABN , Publish Date - Apr 14 , 2024 | 10:51 PM

ప్రభుత్వ దుకాణం నుంచి బెల్ట్‌ షాపునకు మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌ఈబీ అధికారులు అరెస్టు చేశారు. 100 క్వార్టర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్‌ఈబీ ఈఎస్‌ రవికుమార్‌ ఆదివారం వెల్లడించారు.

సర్కారు వైన్స్‌ టూ బెల్ట్‌షాప్‌!

మద్యం అక్రమంగా తరలింపు

సేల్స్‌మన్‌, గొలుసు దుకాణం నిర్వాహకుడు అరెస్టు

100 క్వార్టర్‌ బాటిళ్లు స్వాధీనం

ఒంగోలు (క్రైం), ఏప్రిల్‌ 14 : ప్రభుత్వ దుకాణం నుంచి బెల్ట్‌ షాపునకు మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌ఈబీ అధికారులు అరెస్టు చేశారు. 100 క్వార్టర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్‌ఈబీ ఈఎస్‌ రవికుమార్‌ ఆదివారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. టంగుటూరు మండలం కందులూరులో ఎస్‌ఈబీ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గోతాం పట్టుకొని అనుమానాస్పదంగా కనిపించిన కొణిజేడుకు చెందిన శ్రీరాం శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. గోతాంలో పరిశీలించగా మద్యం బాటిళ్లు కనిపించాయి. అతడిని విచారించగా కందులూరులోని మద్యం దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న కొప్పోలుకు చెందిన మాదాల చైతన్య క్వార్టర్‌ బాటిల్‌కు ఎమ్మార్పీకంటే అదనంగా రూ.10 తీసుకొని తనకు విక్రయించినట్లు చెప్పారు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. చైతన్యను సేల్స్‌మన్‌ ఉద్యోగం నుంచి తొలగించాలని ఎక్షైజ్‌ అధికారులకు సిఫార్సు చేశామని తెలిపారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సేల్స్‌మన్‌లు, సూపర్‌ వైజర్లు నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పమని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే 30 మంది సిబ్బందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో ఎస్‌ఈబీ సీఐ వంశీధర్‌, ఒంగోలు ఎస్‌ఈబీ స్టేషన్‌ సీఐ జి.సూర్యనారయణ, ఎస్సై సిహెచ్‌.గీత, కానిస్టేబుల్‌ ఏడుకొండలు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 10:51 PM