Share News

ఇసుక సమస్య మళ్లీ మొదటికి..

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:48 AM

ఎన్నిక కోడ్‌ వచ్చిన తరువాత అద్దంకి ప్రాంతంలో ఇసుక రవాణాపై మైనింగ్‌ అధికారుల తనిఖీలు పెరిగాయి. దీంతో ఇసుక రవాణా పూర్తిగా నిలిచింది. దీనినిబట్టి ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. గుండ్లకమ్మ నదిలో అద్దంకి ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి రీచ్‌ను అధికారికంగా గుర్తించలేదని గ తంలో మైనిగ్‌ అధికారులు ప్రకటించారు.

ఇసుక సమస్య మళ్లీ మొదటికి..
గుండ్లకమ్మ న ది లో జరుగుతన్న ఇసుక తవ్వకాలు(ఫైల్‌)

- నిలిచిన ర వాణా

- ఎన్నికల కోడ్‌ వ చ్చిన తరువాత పెరిగిన మైనింగ్‌ అఽధికారుల తనిఖీలు

- ఇప్పటివర కు అంతా అనఽఽధికారమేనా!

- వైసీపీ నేతల జేబులలోకి వెళ్లాయేమోనన్న అనుమానాలు

అద్దంకి, మార్చి 28: ఎన్నిక కోడ్‌ వచ్చిన తరువాత అద్దంకి ప్రాంతంలో ఇసుక రవాణాపై మైనింగ్‌ అధికారుల తనిఖీలు పెరిగాయి. దీంతో ఇసుక రవాణా పూర్తిగా నిలిచింది. దీనినిబట్టి ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. గుండ్లకమ్మ నదిలో అద్దంకి ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి రీచ్‌ను అధికారికంగా గుర్తించలేదని గ తంలో మైనిగ్‌ అధికారులు ప్రకటించారు. అయితే, క్షేత్రస్థాయులో ఇసుక తవ్వకాలు అడ్డుకున్న దాఖలాలు లేవు. దీనివెనుక రాష్ట్ర స్థాయిలో సీనరేజ్‌ దక్కించుకున్న సంస్థకు అధికార పార్టీ అండ దండలు పుష్కలంగా ఉండటంతో పాటు స్థానిక అధికార పార్టీ నేతలకు వాటాలు అందటమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈనేపథ్యంలో ఎన్నికల కోడ్‌ రావటంతో మైనింగ్‌ అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. దీంతో అనధికారికంగా సీనరేజ్‌వసూలు చేసిన వ్యకులు జారుకున్నట్లు సమాచారం. మైనింగ్‌ అఽధికారులతో పాటు ఎస్‌ఈబీ అధికారులు కూడా తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో అవకాశం దొరికినప్పుడల్లా ఎస్‌ఈబీ అధికారులు త నిఖీల పేరుతో వసూళ్లకు తెర లేపినట్టు విమర్శలు వస్తున్నాయి. మణికేశ్వరం వద్ద గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో ఇటీవల ఇసుక దందా జోరుగా సాగగా, ప్రస్తుతం అక్కడ కూడా ఇసుక రవాణానిలిపివేశారు. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులకు నోట్లో ఎలక్కాయ పడినట్లయింది. అయితే, ఇసుక రవాణా నిలిచిపోవటతో భవననిర్మాణ దారులకు ఇక్కట్లు మొదలయ్యాయి.

Updated Date - Mar 29 , 2024 | 12:48 AM